క్రీడాభూమి

ఆమ్లా సెంచరీ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 7: పదో ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకా శాలను పోగొట్టుకున్న గుజరాత్ లయన్స్, ఆదివారం నాటి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను దెబ్బతీసింది. హషీం ఆమ్లా సెంచరీ తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా గుజరాత్ మరో రెండు బంతు లు మిగిలి ఉండగా, నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, విజయం సాధించింది. డ్వెయన్ స్మిత్ (74), సురేష్ రైనా (39), దినే ష్ కార్తీక్ (35 నాటౌట్) గుజరాత్‌ను గెలిపించారు. చక్కటి ఆటతో అలరించిన ఆమ్లా చేసిన సెంచరీ వృథా అయంది.
టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యా టింగ్ చేయాల్సి వచ్చిన పంజాబ్ కేవలం రెండు పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (2) వికెట్‌ను కోల్పోయంది. అయతే, ఫ స్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌తో కలిసి మరో ఓపెనర్ హషీం ఆమ్లా జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వా మ్యం నమోదైన తర్వాత షాన్ మార్ష్ వెనుదరిగాడు. అతను 43 బం తులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 58 పరుగులు సాధించాడు. క్రీజ్‌లో పాతుకుపోయన ఆమ్లా 60 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చే సిన తర్వాత, ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉన్నప్పు డు అవుటయ్యాడు. అతను ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు సాధించ డంతో, పంజాబ్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చే యగలిగింది. అప్పటికి గ్లేన్ మాక్స్‌వెల్ (20), అక్షర్ పటేల్ (2) క్రీజ్ లో ఉన్నారు. ప్రదీప్ సంగ్వాన్, ధవళ్ కులకర్ణి, బాసిల్ థంపి తలా ఒక్కో వికెట్‌ను తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
పంజాబ్‌ను ఓడించేందుకు 190 పరుగులు సాధించగాల్సిన గుజ రాత్‌కు ఓపెనర్లు డ్వెయన్ స్మిత్, ఇషాన్ కిషన్ చక్కటి ఆరంభా న్నిచ్చారు. మొదటి వికెట్‌కు 91 పరుగులు జోడించిన తర్వాత నటరాజన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టగా అవుటైన కిషన్ 24 బంతులు ఎదుర్కొని, 3 ఫోర్లతో 29 పరు గులు చేశాడు. డ్వెయన్ స్మిత్ 39 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి గ్లేన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్‌కు దొరికా డు. దినేష్ కార్తీక్‌తో కలిసి మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ సురేష్ రైనా (39) అవుటయ్యాడు. అతని వికెట్‌ను తీసిన సందీప్ శర్మ అదే ఓవర్‌లో ఆరోన్ ఫించ్ (2)ని కూడా వెనక్కు పంపాడు. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరంకాగా, ఆ రోన్ ఫించ్ వేసిన 19వ ఓవర్‌లో 16 పరుగులు లభించాయ. దీనితో చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 8 పరుగుల దూరంలో నిలి చింది. ఆ ఓవర్ వేసిన నటరాజ్ మొదటి బంతిలో మూడు పరుగులి చ్చాడు. తర్వాత వరుసగా రెండు వైడ్స్ వేశాడు. అనంతరం రవీంద్ర జడేజా ఒక పరుగు చేయగా, ఒక బంతిని రక్షణాత్మకంగా ఆడిన దినే ష్ కార్తీక్ నాలుగో బంతిని ఫోర్‌గా మార్చి, గుజరాత్‌ను గెలిపించా డు. అతను 23 బంతుల్లో 35 పరుగులు చేసి, జడేజా (7)తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగా, గుజ రాత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.