క్రీడాభూమి

ధోనీ సమర్థుడు పంత్‌కు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్
న్యూఢిల్లీ, మే 8: మహేంద్ర సింగ్ ధోనీ సమర్ధుడని, అందుకే, అతనికి జట్టులో చోటు లభించిందని జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను ప్రతిభావంతుడని పేర్కొన్న ఎమ్మెస్కే అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నాడు. రాబోయే టోర్నీలు, వచ్చే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, పటిష్టమైన జట్టును సిద్ధం చేయాలంటే, 35 ఎళ్ల ధోనీని జట్టులో కొనసాగించడం మంచిది కాదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెస్కే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ధోనీ స్థానంలో 19 ఏళ్ల పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌ను అతను పరోక్షంగా ప్రస్తావించాడు. సెలక్టర్లకు ధోనీపై నమ్మకం ఉందని, చాంపియన్స్ ట్రోఫీలో అతను రాణిస్తాడని అన్నాడు. ప్రపంచ మేటి వికెట్‌కీపర్లలో ధోనీ ఒకడని ప్రశంసించాడు. ఇటీవల కాలంలో అతను నిలకడగా బ్యాటింగ్ చేయలేకపోతున్న విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, ఆ అంశంపైనే ధోనీ దృష్టి కేంద్రీకరించాడని చెప్పాడు. అతనిని విలువ కట్టలేని సంపదగా అభివర్ణించాడు. అత్యంత సంక్లిష్టమైన సందర్భాల్లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా జట్టును అండగా నిలిసే సత్తా ధోనీకి ఉందని కొనియాడాడు. ధోనీ అసాధారణ వికెట్‌కీపర్ అనే విషయాన్ని మరచిపోయి, చాలా మంది అతని బ్యాటింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారని అన్నాడు. గత పది పనే్నళ్లుగా ధోనీ కీపింగ్‌లో ఎప్పుడూ విఫలం కాలేదన్న విషయాన్ని గమనించాలని చెప్పాడు. అతనిని స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా చూస్తున్నారే తప్ప, ప్రపంచ మేటి వికెట్‌కీపింగ్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదన్నాడు.
రిషభ్ పంత్‌ను భారత భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నామని ఎమ్మెస్కే అన్నాడు. పంత్ ముందు సుదీర్ఘమైన కెరీర్ ఉందని, కాబట్టి, జాతీయ జట్టులో అతనికి చోటు లభించనందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు లేరని ఓ విలేఖరి అన్న మాటపై స్పందిస్తూ, ‘జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య యువకులు కారా?’ అని ప్రశ్నించాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఎందుకు తీసుకోలేదని అదే విలేఖరి ప్రశ్నించినప్పుడు సమావేశానికి కన్వీనర్‌గా వ్యవహరంచిన అమితాబ్ చౌదరీ తీవ్రంగా స్పందించాడు. ‘ఒకవైపు యువ ఆటగాళ్ల గురించి అడుగుతూనే మరోవైపు హర్భజన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వలేదనడంలో ఔచిత్యం ఉందా’ అని నిలదీశాడు. సంజూ శాంసన్, బాసిల్ థంపి పేర్లను ఓ విలేఖరి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్కే సమాధానమిస్తూ, వారిద్దరికీ భారత్ ‘ఎ’ జట్టులో ఆడి, మరింత అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్ల ట్రోఫీ కాబట్టి, ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండేలా చూశామని అన్నాడు.