క్రీడాభూమి

నేటి నుంచి ఆసియా రెజ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: న్యూఢిల్లీలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ సారథ్యం వహించనుండటంతో పాటు ఈ ఈవెంట్‌లో ఆమే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, గీతా పొగట్, ఆమె సోదరి బబితా పొగట్ లాంటి భారత లీడింగ్ రెజ్లర్లు ఈ ఈవెంట్‌కు దూరమవడంతో సాక్షి మాలిక్‌తో పాటు ఒలింపియన్ సందీప్ తొమర్, బజరంగ్ పునియాపైనే భారత శిబిరం ఆశలు పెట్టుకుంది. గత ఏడాది థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. వీటిలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, మరో ఐదు కాంస్యాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సందీప్ తొమర్ పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఏకైక పసిడి పతకాన్ని అందించాడు. ఈ ఏడాది భారత రెజ్లర్లకు ఇదే పెద్ద పోటీ కావడంతో ఫ్రీస్టయిల్, గ్రీకో-రోమన్, మహిళల విభాగాల్లో ఎనిమిది మంది చొప్పు మొత్తం 24 మంది సభ్యులతో కూడిన జట్టును బరిలోకి దింపుతున్నారు. ఈ టోర్నీలో ప్రదానం చేయనున్న 24 స్వర్ణ, 24 రజత, 48 కాంస్య పతకాల కోసం ఫ్రీస్టయిల్ విభాగంలో మొత్తం 112 మంది, గ్రీకో-రోమన్ విభాగంలో 103 మంది, మహిళల విభాగంలో 83 మంది రెజ్లర్లు పోటీపడనున్నారు.
ఇదీ భారత జట్టు
పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం: సందీప్ తొమర్ (57 కిలోల కేటగిరీ), హర్ఫుల్ (61 కిలోలు), బజరంగ్ (65 కిలోలు), వినోద్ (70 కిలోలు), జితేందర్ (74 కిలోలు), సోమ్‌వీర్ (86 కిలోలు), సత్యవ్రత్ కదియన్ (97 కిలోలు) సుమిత్ (125 కిలోలు).
గ్రీకో-రోమన్ విభాగం: జ్ఞానేందర్ (59 కిలోలు), రవీందర్ (66 కిలోలు), దీపక్ (71 కిలోలు), గుర్‌ప్రీత్ (75 కిలోలు), హర్‌ప్రీత్ (80 కిలోలు), అనిల్ కుమార్ (85 కిలోలు), హర్‌దీప్ (98 కిలోలు), నవీన్ (130 కిలోలు).
మహిళల విభాగం: రీతూ (48 కిలోలు), పింకీ (53 కిలోలు), వినేశ్ (55 కిలోలు), సాక్షి మాలిక్ (58 కిలోలు), సరిత (60 కిలోలు), రీతూ (63 కిలోలు), దివ్యా కక్రాన్ (69 కిలోలు), జ్యోతి (75 కిలోలు).

చిత్రం..ప్రధాన ఆకర్షణగా నిలువనున్న ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్