క్రీడాభూమి

కార్షీ చాలెంజర్ టోర్నీలో యూకీ, బాలాజీ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్షీ (ఉజ్బెకిస్తాన్), మే 9: భారత డేవిస్ కప్ జట్టులో సభ్యులుగా ఉన్న యువ ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, ఎన్.శ్రీరామ్ బాలాజీ ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కార్షి చాలెంజర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభాన్ని సాధించారు. అయితే భారత్‌కు చెందిన ఇతర ఆటగాళ్లు మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. పూర్తిగా భారతీయుల మధ్యనే జరిగిన తొలి రౌండ్ పోరులో యూకీ 6-4, 6-2 సెట్ల తేడాతో తన సహచరుడు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్‌పై విజయం సాధించగా, బాలాజీ 6-3, 6-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫరుక్ దస్తోవ్‌ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అయితే ఇటీవల తల్లహస్సీలో జరిగిన చాలెంజర్ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్ లెవల్‌కు చేరుకున్న రామ్‌కుమార్‌తో పాటు భారత్ నేషనల్ హార్డ్‌కోర్ట్ చాంపియన్ విష్ణు వర్థన్‌కు ఈ టోర్నీలో ఆదిలోనే పరాజయాలు ఎదురయ్యాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 216వ స్థానంలో కొనసాగుతున్న రామ్‌కుమార్‌పై ఇటలీ ఆటగాడు సెమ్ లికెల్ (ప్రపంచ ర్యాకింగ్స్‌లో 326వ స్థానం) 6-4, 6-4 సెట్ల తేడాతో విజయం సాధించగా, విష్ణు వర్థన్ 3-6, 5-7 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన వ్లాద్విస్లావ్ మనాఫోవ్ చేతిలో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

చిత్రం.. యూకీ బాంబ్రీ