క్రీడాభూమి

గ్రేటర్ నోయిడాలో బాస్కెట్ బాల్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, మే 9: జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఏ) మంగళవారం గ్రేటర్ నోయిడాలో దేశంలోనే తన తొలి అకాడమీని ప్రారంభించింది. దేశంలో బాస్కెట్ బాల్ క్రీడ ఎదుగుదలకు ఇది దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని ఎన్‌బిఏ వ్యక్తం చేసింది. దేశంలోని వర్ధమాన పురుష, మహిళా బాస్కెట్‌బాల్ క్రీడాకారులకోసం ఇక్కడి జేపీ గ్రీన్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ అకాడమీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు జరిపిన టాలెంట్ సెర్చ్ సందర్భంగా ఎంపిక చేసిన 21 మంది పురుష క్రీడాకారులకు ఈ అకాడమీలో శిక్షణతో పాటుగా స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్‌బిఏ డిప్యూటీ కమిషనర్ మార్క్ టటుమ్, ఎన్‌బిఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యానిక్ కొలాకో హాజరయ్యారు. దేశంలో బాస్కెట్ బాల్ అభివృద్ధి ఎదుగుదలకు ఎన్‌బిఏ చేస్తున్న కృషిలో ఈ అకాడమీ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా టాటుమ్ చెప్పాడు.