క్రీడాభూమి

అల్విస్ సూపర్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్యూరిన్ (ఇటలీ), మే 10: డానీ అల్విస్ సూపర్ గేమ్ చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జువెంటాస్‌ను ఫైనల్ చేర్చింది. మొనాకోతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకున్న జువెంటాస్ మొత్తం మీద 4-1 సగటుతో ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన జువెంటాస్‌కు 33వ నిమిషంలో తొలి గోల్ లభించింది. ప్రత్యర్థుల నుంచి తప్పిస్తూ అల్విస్ ఎంతో చాకచక్యంగా అందించిన పాస్‌ను మారియో మంజుకిక్ సద్వినియోగం చేసుకున్నాడు. ఈ గోల్ లభించిన తర్వాత అల్విస్ మరింత దూకుడుగా ఆడాడు. మరో 11 నిమిషాల తర్వాత అతను స్వయంగా గోల్ సాధించి, జువెంటాస్ ఆధిక్యాన్ని 2-0కు చేర్చాడు. ద్వితీయార్ధం ఆరంభంలో మొనాకో గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను జువెంటాస్ అడ్డుకుంది. అత్యంత పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రత్యర్థిని నిలువరించింది. 69వ నిమిషంలో మొనాకో ప్రయత్నం ఫలించి, కేలియన్ మపే ద్వారా ఒక గోల్‌ను సంపాదించుకుంది. కానీ, ఆతర్వాత ఈక్వెలైజర్‌ను సాధించలేక, ఓటమిపాలైంది.

చిత్రం..డానీ అల్విస్