క్రీడాభూమి

నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడెలిన్ (కొలంబియా), మే 10: కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో ఫుట్‌బాల్ క్రీడాకారులుసహా మొత్తం 71 మంది మృతి చెందిన సంఘటను గుర్తు చేసుకుంటూ చపెకొయన్స్ జట్టు ఆటగాళ్లు సంఘటన స్థలంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిరుడు నవంబర్ 30న జరిగిన విమాన ప్రమాదం యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కొలంబియాలోని బగోటాకు సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో, బ్రెజిలియన్ సాకర్ క్లబ్ చపెకొయన్స్ రియల్ జట్టుకు చెందిన క్రీడాకారులు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోయిన సంఘటనను సాకర్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 71 మంది మృతి చెందారు. ‘ఎలక్ట్రికల్ వైఫల్యం’ కారణంగా లామియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ చార్టర్డ్ విమానం మెడిలియన్ సిటీ సమీపంలో కూలిపోయిందని మొదట అనుకున్నప్పటికీ, ఇంధనం అయిపోవడమే ప్రమాదానికి కారణమని ఆతర్వాత ప్రకటించారు. ఈ సంఘటనలో చపెకొయన్స్ రియల్ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 19 మంది క్రీడాకారులు, 17 మంది సిబ్బంది, ఏడుగురు డైరక్టర్లు సహా మొత్తం 43 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఆరుగురిలో ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఉన్నారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుదామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులు దుర్మరణం చెందారు. కాగా, ఆ క్లబ్ తరఫున ఇప్పుడు ఆడుతున్న పలువురు క్రీడాకారులు నాటి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఒకప్పటి తమ సహచరులకు కన్నీళ్లతో నివాళులర్పించారు.

చిత్రం..కొలంబియా విమాన ప్రమాద స్థలిలో చపెకొయన్స్ క్రీడాకారులు