క్రీడాభూమి

పంజాబ్‌కు మరో పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే, గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించాలి. అయితే, టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబయిని ఆ జట్టు హోం గ్రౌండ్‌లోనే ఓడించడం అనుకున్నంత సులభం కాదు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా 14 పరుగుల తేడాతో విజయం సాధించడంతో, గ్లేన్ మాక్స్‌వెల్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడలేదు. ఈ జట్టు ఇంత వరకూ 12 మ్యాచ్‌లు ఆడి, 12 పాయింట్లు సంపాదించింది. ఒకవేళ, ముంబయి చేతిలో ఓడితే పంజాబ్ ఇంటిదారి పట్టక తప్పదు. ఆతర్వాత జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ (13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు), రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ (12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు), డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (13 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) తమతమ తదుపరి మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండానే పంజాబ్ కంటే మెరుగైన స్థితిలో ఉంటారు. కాబట్టి, ముంబయిని ఓడిస్తేనే మాక్స్‌వెల్ బృందం ప్లే ఆఫ్ ఆశలకు ఊపిరి లభిస్తుంది. లేకపోతే, ఆ జట్టుకు చివరి గ్రూప్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది.

చిత్రం..మాక్స్‌వెల్