క్రీడాభూమి

ఐసిసి చైర్మన్ అతనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 10: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కొనసాగనున్నాడు. అతను తన పదవీకాలాన్ని పూర్తి చేస్తాడని, వచ్చే ఏడాది జూన్ చివరి వరకూ చైర్మన్‌గానే ఉంటాడని ఐసిసి పాలక మండలి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తాము చేసిన సూచనకు మనోహర్ సానుకూలంగా స్పందించాడని పేర్కొంది. నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థిని ఐసిసి చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. నిరుడు మే మాసంలో జరిగిన ఎన్నికల్లో అతను రెండేళ్ల కాలానికి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. అయితే, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అతను ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, బిసిసిఐతో కొనసాగుతున్న విభేదాలే ఇందుకు కారణమన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రాజీనామా చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, ఆతర్వాత జరిగిన పాలక మండలి సమావేశంలో మనోహర్ రాజీనామా చర్చకు వచ్చింది. వివిధ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన అతనిని కొంత కాలం చైర్మన్‌గా కొనసాగాలని ఆ సమావేశం సూచించింది. దానికి అంగీకరించిన అతను ఇటీవల ముగిసిన కీలక సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఇలావుంటే, సంస్కరణల ప్రక్రియ పూర్తికావడంతోపాటు, పరిస్థితులు ఒక గాడిన పడే వరకూ అతనే చైర్మన్‌గా కొనసాగుతాడని ఐసిసి పాలక మండలి తన ప్రకటనలో పేర్కొంది. దీనితో వచ్చే ఏడాది జూన్ వరకూ ఐసిసి చైర్మన్‌గా మనోహర్ కొనసాగింపు ఖాయమైంది.
మనోహర్ గుగ్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శశాంక్ మనోహర్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు. నిరుడు మే మాసంలో ఐసిసి చైర్మన్‌గా ఎన్నికైన అతను ఈఏడాది మార్చిలో హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశాడు. నేరుగా చెప్పకపోయినా, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వైఖరే తన నిర్ణయానికి ప్రధాన కారణమన్న విషయాన్ని అతను పరోక్షంగా తెలిపాడు. అప్పటికే బిసిసిఐ గుర్రుగా ఉన్న క్రికెట్ బోర్డుల మద్దతును దక్కించుకోగలిగాడు. అతను విసిరిన గుగ్లీకి బిసిసిఐ క్లీన్ బౌల్డ్ అయింది. ఐసిసి కూడా కంగుతిన్నది. నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థినే ఐసిసి చైర్మన్‌గా ఎన్నుకోవాలి. వచ్చే ఏడాది జూన్‌తో ముగిసే కాలానికి నిరుడు మే మాసంలో ఈ పదవికి ఎన్నికైన మనోహర్ ఎనిమిది నెలలు కూడా పూర్తికాకుండానే రాజీనామా చేయడం సహజంగానే ప్రపంచ క్రికెటింగ్ దేశాల దృష్టిని ఆకర్షించింది. చాలా విషయాల్లో బిసిసిఐతో వ్యతిరేకిస్తూ వస్తున్న అతని పక్షాన నిలవాలని టెస్టు హోదాగల మిగతా క్రికెట్ బోర్డులు నిర్ణయించునేలా చాకచక్యంగా వ్యవహరించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. పదవీకాలం పూర్తయ్యే వరకూ చైర్మన్‌గా ఉంటాడంటూ పాలక మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో మనోహర్ వ్యూహం సఫలమైంది. మనోహర్ ఐసిసి చైర్మన్‌గా కొనసాగితే, బిసిసిఐ భారీగా నష్టపోతుందనేది వాస్తవం. అతను ఇటీవలే పలు సంస్కరణలను ప్రవేశపెట్టి, వాటికి అనుకూలంగా పాలక మండలి ఓట్లను సంపాదించాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో కూడిన ‘బిగ్ త్రీ’ దేశాలకు ఉన్న ప్రత్యేక ఆర్థిక హక్కులు, భారీ వాటాలపై వేటు పడడం దాదాపుగా ఖాయమైంది. పాలక మండలి ఆమోదం పొందిన పలు సంస్కరణలు, తీర్మానాలను సర్వసభ్య సమావేశం అంగీకరించడ లాంఛనమే. ఈ పరిణామాలన్నీ మనోహర్ ప్రణాళికా బద్ధమైన ఆలోచనలు, కార్యాచరణ వల్ల సాధ్యమైందనేది బహిరంగ రహస్యం. క్రికెట్ పాలనా వ్యవహారాలను మరింత పారదర్శకంగా ఉంచేందుకు అతను చేస్తున్న ప్రయత్నాలకు కూడా టెస్టు హోదాగల దేశాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇటీవల జరిగిన ఐసిసి పాలక మండలి సమావేశంలో అతను ప్రతిపాదించిన పలు సంస్కరణలకు ఆమోద ముద్ర పడింది. బిసిసిఐ ఎంతగా వ్యతిరేకించినా పట్టించుకోని మనోహర్ చివరికి ‘బిగ్ త్రీ’కి భారీ వాటా రాకుండా అడ్డుకోవడంలో ఒక అధ్యాయాన్ని పూర్తి చేశాడు. టెస్టు హోదాగల బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ బోర్డుల మద్దతును మొదట్లో బిసిసిఐ కూడగట్టుకున్నప్పటికీ, ఆతర్వాత హఠాత్తుగా అవి మనసు మార్చుకోవడానికి మనోహర్ రాజీనామా అస్త్రం కూడా ఒక కారణమని అంటున్నారు. మనోహర్ సంస్కరణలకు ఆమోద ముద్ర పడాలంటే, మూడింట రెండు వంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలని, పది దేశాలకు టెస్టు హోదా ఉంటే, వాటిలో నాలుగు తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే, సంస్కరణల ప్రయత్నం బెడిసికొడుతుందని బిసిసిఐ ఆశించింది. కానీ, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే దేశాల మద్దతు ఉందని ధీమాతో పాలక మండలి సమావేశానికి వెళ్లింది. అయితే, అక్కడ బిసిసిఐకి చుక్కెదురైంది. ఓటింగ్‌కు వెళ్లి, అక్కడ చావుదెబ్బ తిన్నది. ‘బిగ్ త్రీ’ దేశాలకు ఎక్కువ వాటాను ఎనిమిది క్రికెట్ బోర్డులు వ్యతిరేకిస్తే, భారత్, శ్రీలంక మాత్రమే సమర్థించాయి. పాలనాపరమైన మార్పులను ఉద్దేశించి మనోహర్ చేసిన ప్రతిపాదనలకు శ్రీలంక కూడా మద్దతు ప్రకటించింది. బిసిసిఐ మాత్రమే వాటిని వ్యతిరేకించి, ఒంటరిదైపోయింది. మొత్తం మీద రాజీనామా అస్త్రంతో అన్ని క్రికెట్ బోర్డులను ఇరుకున పెట్టిన అతను పాలక మండలి సమావేశంలో తాను అనుకున్న ఫలితాలను రాబట్టగలిగాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించడం లాంఛనమే.ఆడినప్పటికీ ఫలితం లేకపోయంది.