క్రీడాభూమి

అనూష కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్: శ్రీలంక బాక్సింగ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన మహిళగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించిన అనూష శాగ్ ఫైనల్‌లో పట్టుతప్పి కిందపడడంతో ఫైట్‌ను కొనసాగించలేక కన్నీళ్లపర్యంతమైంది. 2003 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన ఆమె టైటిల్‌పై ఆశపెట్టుకుంది. కానీ, మేరీ కోమ్ విసిరిన బలమైన పంచ్‌కి కిందపడంతో మోకాలికి గాయమై, ప్రత్యర్థికి నాకౌట్ విజయాన్ని అందించాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న అనూష రజత పతకాన్ని స్వీకరించే సమయంలో పోడియం వద్ద బిగ్గరగా ఏడుస్తూ కనిపించింది.
టికెట్ల కోసం క్యూలు
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీలో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఫైట్‌ను కేవలం 500 మంది మాత్రమే తిలకించేందుకు వీలుంది. అందుకే, టికెట్ల కోసం మంగళవారం ఉదయం నుంచే అభిమానులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. చాలా మంది టికెట్లు లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
పేమెంట్ వివాదం
శాగ్ చివరి రోజున బాక్సింగ్ ఇండియా అడ్‌హాక్ కమిటీ ప్రతినిధులు, గేమ్స్ నిర్వాహకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఫలితంగా మహిళల బాక్సింగ్ ఫైనల్ పోటీలు సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాయి. తమకు రావాల్సిన పేమెంట్స్ అందలేదని ఆరోపించిన బాక్సింగ్ ఇండియా ప్రతినిధులు ఒకానొక దశలో పోటీలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయితే, నిర్వాహకులు మాత్రం వారి వాదనను తోసిపుచ్చారు. ముందుగా అంగీకారం కుదిరిన మొత్తం కంటే ఎక్కువగా చెల్లింపులు జరపాలంటూ బాక్సింగ్ ఇండియా ప్రతినిధులు బ్లాక్‌మెయిల్‌కు దిగారని ఆరోపించారు. ఇరు వర్గాలు చాలాసేపు మొండి వైఖరిని ప్రదర్శించడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. అయితే, ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.