క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, మే 11: ఒలింపిక్స్‌ను నిర్వహించే సత్తా తమకు ఉందని, 2024లో ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీ ధీమా వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్ నిర్వాహణకు తొలుత ఐదు దేశాలు పోటీపడగా, ఇప్పుడు బరిలో లాస్ ఏంజిలిస్, పారిస్ మాత్రమే కొనసాగుతున్నాయి. ఒలింపిక్స్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు, అక్కడి వౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) కమిటీ ప్రస్తుతం లాస్ ఏంజిలిస్‌లో పర్యటిస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక విలేఖరుల సమావేశంలో గార్సెటీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతామని అన్నాడు. పరిశీలకుల బృందం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ విధంగా అధ్యయనం చేసినప్పుడే తాము తీసుకుంటున్న చర్యల గురించి స్పష్టత వస్తుందని తెలిపాడు. భద్రతాపరమైన సమస్యలు ఏవీ లేని నగరంగా లాస్ ఏంజిలిస్‌ను అభివర్ణించాడు.

చిత్రం..విలేఖరులను ఉద్దేశించి మాట్లాడుతున్న లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెటీ