క్రీడాభూమి

ప్రత్యర్థి జట్టుకు బ్రాస్‌వెల్ మార్గదర్శకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, మే 11: న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ జాన్ బ్రాస్‌వెల్ ప్రత్యర్థి జట్టుకు మార్గదర్శకం వహిస్తూ, తాను ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకే సవాళ్లు విసరనున్నాడు. ఇక్కడ జరిగే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌తోపాటు ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లు కూడా తలపడతాయి. కెరీర్‌లో 41 టెస్టులు, 53 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన కివీస్ మాజీ బౌలర్ బ్రాస్‌వెల్ రెండేళ్ల క్రితం ఐర్లాండ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఐర్లాండ్‌కు దిశానిర్దేశనం చేస్తూ, ఆ జట్టును ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. ఇలావుంటే, ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నీలో ఐర్లాండ్, న్యూజిలాండ్ జట్లు రెండు మ్యాచ్‌ల్లో ఢీకొంటాయి. బ్రాస్‌వెల్ ఐర్లాండ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తూ, తన మాజీ జట్టుకే సవాళ్లు విసరనున్నాడు. ఈ జట్టు తొలి మ్యాచ్‌ని శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. న్యూజిలాండ్‌తో ఆదివారం తలపడుతుంది.

చిత్రం.. న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ జాన్ బ్రాస్‌వెల్