క్రీడాభూమి

పంజాబ్ ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: పదో ఐపిఎల్‌లో నాకౌట్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో గురువారం ముంబయి ఇండియన్స్‌ను ఢీకొన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెలరేగిపోయింది. మూడు వికెట్లకు 230 పరుగులు సాధించి, ఈ ఐపిఎల్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. వృద్ధిమాన్ సాహా అజేయ అర్ధ శతకం, కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ పంజాబ్ భారీ స్కోరుకు సహకరించాయి. అనంతరం ముం బయ కూడా చివరి క్షణం వరకూ లక్ష్యాన్ని ఛే దించేందుకు ప్రయత్నంచడంతో పోరు ఉ త్కంఠ భరితంగా సాగింది. అయతే, చివరి క్ష ణాల్లో తడబడిన ముంబయ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి, ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
టాస్ గెలిచి ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మార్టిన్ గుప్టిల్, వృద్ధిమాన్ సాహా చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 68 పరుగులు జత కలిసిన తర్వాత గుప్టిల్ వికెట్ కూలింది. అతను 18 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేసి, కర్న్ శర్మ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్స్‌వెల్ చెలరేగిపోవడంతో, సాహాకు కూడా అతని బాటను అనుసరించక తప్పలేదు. మాక్స్‌వెల్ కేవలం 21 బంతులు ఎదుర్కొని 47 పరుగులు సాధించి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. షాన్ మార్ష్ 16 బంతుల్లో 25 పరుగులు చేసిన తర్వాత మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు దొరికాడు. పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగులు సాధించే సమయానికి సాహా 93 (55 బంతులు, 11 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ 19 (13 బంతులు, ఒక సిక్సర్) నాటౌట్‌గా ఉన్నారు.
ఓపెనర్ల విజృంభణ
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి ఓపెనర్లు పార్థీవ్ పటేల్, లెండల్ సిమన్స్ చెలరేగిపోయారు. పంజాబ్ బౌలింగ్‌ను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఆడుతూ, 5 ఓవర్లలోనే స్కోరు బోర్డును 50 పరుగుల మైలురాయిని దాటించారు. 8.4 ఓవర్లలో స్కోరు 99 పరుగులకు చే రుకోగా, 23 బంతుల్లో, ఏడు ఫోర్లతో 38 పరుగులు చేసిన పా ర్థీవ్ పటేల్‌ను మానన్ వోహ్రా క్యాచ్ పట్టగా మోహిత్ శర్మ అవుట్ చేశాడు. మరో ఏడు పరుగులకే సిమన్స్ వికెట్ కూడా కూలింది. 32 బంతులు ఎదుర్కొన్న అతను 5 ఫోర్లు, 4 సిక్స ర్లతో 59 పరుగులు సాధించి, మాక్స్‌వెల్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. నితీష్ రాణా (12), కెప్టెన్ రోహిత్ శర్మ (5) తక్కువ స్కోర్లకే అవుట్‌కాగా, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించా రు. సందీప్ శర్మ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా అవుటైన హార్దిక్ పాండ్య 13 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. కీలక ఆటగాళ్లు వెనుదిరగడంతో జట్టును గెలిపించే బా ధ్యత పొలార్డ్‌పై పడింది. కర్న్ శర్మ జత కలవడంతో ముంబ య 17.3 ఓవర్లలో 200 పరుగులను పూర్తి చేసింది. మోహిత్ శర్మ బౌ లింగ్‌లో కర్న్ శర్మ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ముంబయ స్కోరు 207 పరుగులు. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్ లో 16 పరుగులు చేయాల్సిన ముంబయ ఎనిమిది పరుగు లకు పరిమితమైంది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు సాధించి, ఏడు పరుగుల తేడా తో పరాజయాన్ని చవిచూసింది. చివరి వరకూ పోరాడిన పొలార్డ్ 24 బంతు ల్లో ఒక ఫోర్, ఐదు భారీ సిక్సర్లతో అజేయం గా 50 పరుగులు చేశాడు. హర్భజన్ సింగ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

* ఐపిఎల్ చరిత్రలో నమోదైన అత్యధిక స్కోర్ల జాబితాలో ముంబయి ఇండియన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేసిన 230 (మూడు వికెట్లకు) స్కోరు తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించింది. ఆ జట్టు పుణే వారియర్స్‌పై 5 వికెట్లకు 263, గుజరాత్ లయన్స్‌పై 3 వికెట్లకు 248 చొప్పున పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉంది. ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్లకు 246, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 5 వికెట్లకు 240 చొప్పున పరుగులు సాధించింది. ఐదో స్థానం తిరిగి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దక్కుతుంది. ముంబయి ఇండియన్స్‌పై ఆ జట్టు ఒక వికెట్ నష్టపోయి 235 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆరు, ఎనిమిది, తొమ్మిది స్థానాలను సంపాదించుకుంది. ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 2 వికెట్లకు 232, చెన్నై సూపర్ కింగ్స్‌పై 4 వికెట్లకు 231, తాజాగా ముంబయి ఇండియన్స్‌పై 3 వికెట్లకు 230 పరుగులు సాధించింది. కాగా, ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన ప్రత్యర్థి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 4 వికెట్లకు 231 పరుగులు సాధించింది.

* ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు వరకూ కేవలం ఏడు జట్లు మాత్రమే 200లకు పైబడిన లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించారు. 2008లో అప్పటి డక్కన్ చార్జెస్‌పై రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లకు 217 పరుగులు సాధించి గెలిచింది. ఈ పదో ఐపిఎల్‌లోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ 3 వికెట్లకు 214 పరుగులు సాధించి, గుజరాత్ లయన్స్‌ను ఓడించింది. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. అదే విధంగా 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 208, 2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 4 వికెట్లకు 206, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లకు 204, అదే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2 వికెట్లకు 204 పరుగులు సాధించి విజయాలను నమోదు చేశాయి.

చిత్రాలు..పోరాటం వృథా..
కీరన్ పొలార్డ్
(50 నాటౌట్)
* వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్)