క్రీడాభూమి

ఆటగాళ్లదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 12: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్లపైనే ఉంటుందని భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ అన్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అతను మాట్లాడుతూ, హోటల్‌లోగానీ, ఇతరత్రా ప్రాంతాల్లోగానీ ఎవరినైనా కలవడం లేదా కలవకపోవడం అనేది ఆటగాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని గుర్తుచేశాడు. ఒకవేళ స్నేహితులు ఎవరైనా కలవడానికి వస్తే, వెంట ఎవరినీ తీసుకురావద్దని వారికి ఖచ్చితంగా చెప్తే సమస్య ఉండదని అన్నాడు. అదే విధంగా గుర్తుతెలియని వ్యక్తులను కలవాల్సిన అవసరం టోర్నీలు లేదా సిరీస్‌లు సందర్భంగా క్రికెటర్లకు ఉండదని చెప్పాడు. ఐపిఎల్‌లో బుధవారం గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కి ముందు పిచ్ తీరు తదితర విషయాలను బుకీలకు చెప్పారన్న ఆరోపణలపై కాన్పూర్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. కాబట్టి, ఆటగాళ్లే జాగ్రత్త పడి, కొత్త వ్యక్తులను కలవకపోతే ఈ సమస్య తలెత్తే అవకాశమే ఉండదని అన్నాడు.