క్రీడాభూమి

టి-20లో రుద్ర డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 12: టి-20 ఫార్మాట్‌లో ముంబయకి చెందిన యువ ఆటగాడు రుద్ర దాండే డబుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అబిస్ రిజ్వీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో రిజ్వీ కాలేజీకి ప్రాతినిథ్యం వహించిన రుద్ర 67 బంతుల్లో 200 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మాతుంగ జింఖానా మైదానంలో, దాల్మియా కాలేజీతో జరిగిన మ్యాచ్‌లో అతను రెచ్చిపోవడంతో రిజ్వీ కాలేజీ 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 322 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ప్రత్యర్థి జట్టు దాల్మియా కాలేజీని 10.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా 247 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. ఇలావుంటే, ఈ డబుల్ సెంచరీ సాధించడానికి ముందే రుద్ర మీడియా దృష్టిని ఆకర్షిం చాడు. నిరుడు అక్టోబర్ మాసంలో జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీ వెస్ట్ జోన్ లీగ్‌లో ముంబయ అండర్-19 జట్టు నుంచి చివరి క్షణాల్లో అతను స్థానం కోల్పోయాడు. సమర్థుడైన తన కుమారుడిని అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపిస్తూ రుద్ర తండ్రి ఆందోళనకు దిగాడు. ముంబయ క్రికెట్ సంఘం కార్యాలయం ముందు హడావుడి చేసిన అతను ఒకానొక దశలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. రుద్ర అతనిని సముదాయంచి, అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆ సంఘటనతో వెలుగులోకి వచ్చిన రుద్ర ఇప్పుడు డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.