క్రీడాభూమి

హోరాహోరీలో డేర్‌డెవిల్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా శుక్రవారం హోరాహోరీగా సాగిన గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించిన డేర్‌డెవిల్స్‌కు ఇది ఆరో విజయం. ఈ ఫలితం వల్ల ఈ జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ, పుణే సూపర్‌జెయింట్‌కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. కరుణ్ నాయర్ 64 పరుగులతో రాణించగా, 20 ఓవర్లలో డేర్‌డెవిల్స్ 8 వికెట్లకు 168 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేరే క్రమంలో మనోజ్ తివారీ (60) చివరి వరకూ శ్రమించినా ఫలితం లేకపోయింది. ఏడు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, మొదటి ఓవర్‌లోనే సంజూ శాంసన్ వికెట్ కూలింది. అతను రెండు పరుగులు చేసి రనౌటయ్యాడు. వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యం ఉన్న శ్రేయాస్ అయ్యర్ 3 పరుగులు చేసి జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించి కరుణ్ నాయర్ మూడో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. 22 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 పరుగులు చేసిన పంత్‌ను డానియల్ క్రిస్టియన్ క్యాచ్ అందుకోగా ఆడం జంపా అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి 83 పరుగుల వద్ద తెరపడింది. మార్లొన్ శామ్యూల్స్ 21 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి డానియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో ధోనీకి చిక్కాడు. కొరీ ఆండర్సన్ మూడు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక, ధోనీ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. 11 పరుగులు చేసిన పాట్ కమిన్స్‌ను బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 45 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లతో 64 పరుగులు సాధించిన కరుణ్ నాయర్ వికెట్ 162 పరుగుల స్కోరువద్ద కూలింది. జయదేవ్ ఉనాద్కత్ క్యాచ్ పట్టుకోగా, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. మహమ్మద్ షమీ రెండు పరుగులు చేసి జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు దొరికిపోయాడు. ఇన్నింగ్స్ ముగియడానికి అప్పటికి ఒక బంతి మాత్రమే మిగిలింది. 20 ఓవర్లలో డేర్‌డెవిల్స్ 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ షాబాజ్ నదీంకు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు. పుణే సూపర్‌జెయింట్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ 29 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్ 31 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
తొలి బంతికే వికెట్
చెప్పుకోదగ్గ భారీ లక్ష్యమేమీ కాకపోయినప్పటికీ, 169 పరుగులు చేసేందుకు బరిలోకి దిగిన పుణే సూపర్‌జెయింట్ మొదటి బంతికే వికెట్ కోల్పోయింది. జహీర్ ఖాన్ వేసిన ఇన్‌స్వింగర్‌ను ఎదుర్కోలేకపోయిన అజింక్య రహానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠీ ఏడు పరుగులు చేసిన తర్వాత జహీర్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. డేర్‌డెవిల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, స్కోరుబోర్డును ముందుకు కదిలిస్తున్న కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 32 బంతుల్లో 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. షాబాజ్ నదీం బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటైన అతను 32 బంతులు ఎదుర్కొన్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న బెన్ స్టోక్స్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మహమ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లో నిలిచి, పోరాటం కొనసాగిస్తున్న తివారీకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జత కలిశాడు. మొత్తానికి పుణే సూపర్‌జెయింట్ చివరి మూడు ఓవర్లలో విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచింది. ఇన్నింగ్స్‌లో 18 ఓవర్‌ను వేసిన పాట్ కమిన్స్ కేవలం 5 పరుగులిచ్చాడు. ఆ ఓవర్‌లోనే ధోనీ (5) రనౌట్ అయ్యాడు. దీనితో చివరి రెండు ఓవర్లలో పుణే సూపర్‌జెయింట్‌కు 33 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసే బాధ్యతను మహమ్మద్ షమీ తీసుకొని, రెండో బంతిలోనే డానియల్ క్రిస్టియన్ (3)ను ఎల్‌బిగా అవుట్ చేశాడు. మొత్తం మీద ఆ ఓవర్‌లో ఒక వికెట్ కోల్పోయిన పుణే ఏడు పరుగులు రాబట్టి, చివరి ఆరు బంతుల్లో విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. చివరి ఓవర్‌ను పాట్ కమిన్స్ వేయగా, మొదటి బంతిని సిక్స్ కొట్టిన మనోజ్ తివారీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. రెండో బంతిలో మరో సిక్స్ బాదాడు. కానీ తర్వాత కమిన్స్ బంతిని నియంత్రించడంతో అదే హోరును కొనసాగించలేకపోయాడు. చివరి బంతిలో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. అతను 45 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. పుణే సూపర్‌జెయింట్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసి, ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 (కరుణ్ నాయర్ 64, రిషభ్ పంత్ 36, మార్లొన్ శామ్యూల్స్ 27, జయదేవ్ ఉనాద్కత్ 2/29, బెన్ స్టోక్స్ 2/31).
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్: 20 ఓవర్లలో 6 వికెట్లకు (స్టీవెన్ స్మిత్ 38, బెన్ స్టోక్స్ 33, మనోజ్ తివారీ 60, జహీర్ ఖాన్ 2/28, మహమ్మద్ షమీ 2/32).

ఉత్కంఠ పోరులో ఓటమిపాలైన రైజింగ్ పుణే సూపర్‌జెయంట్ ఓటమి ఒక రకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లాభించనుంది. ప్రస్తుతానికి పాయంట్ల పట్టికలో పుణే కంటే సన్‌రైజర్స్ కేవలం ఒక పాయంట్ మాత్రమే తక్కువగా ఉంది. కాబట్టి ప్లే ఆఫ్ అవకాశాలు డిఫెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్‌కు మరింతగా పెరిగాయ

చిత్రాలు..కరుణ్ నాయర్
*మొదటి బంతికే క్లీన్ బౌల్డ్.. అజింక్య రహానే