క్రీడాభూమి

పారిస్‌కు ఐఒసి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 13: ఇటీవలే లాస్ ఏంజిలిస్ (అమెరికా)లో పర్యటించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) బృందం ఇక పారిస్‌కు వెళ్లి, 2024 ఒలింపిక్స్ నిర్వాహణకు అక్కడ ఉన్న సౌకర్యాలను, ఏర్పాట్లను, నిర్మాణాలను పరిశీలించనుంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమాన్యుయెల్ మాక్రాన్ ఎన్నికయ్యాడు. అతను ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఫ్రాన్స్ రాజకీయాలు పరిణామ దశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఒసి బృందం పారిస్‌లో పర్యటించడం ఆసక్తిని రేపుతున్నది. అయితే, క్రీడలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఐఒసి చీఫ్ థామస్ బ్యాచ్ వ్యాఖ్యానించాడు. విధి నిర్వహణలో భాగంగానే ఐఒసి బృందం పారిస్‌లో పర్యటిస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. ఇలావుంటే, అధ్యక్షుడిగా ఎన్నికైన మాక్రాన్ ఇప్పటికే పారిస్ బిడ్‌ను సమర్థిస్తున్నట్టు ప్రకటించాడు. ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పాడు.