క్రీడాభూమి

గెలుపు మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: సుదీర్మన్ కప్ మిక్స్‌డ్ టీం బాడ్మింటన్ ఈవెంట్‌లో ఈసారి భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, టైటిల్ దక్కించుకుంటామని స్టార్ షట్లర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు ధీమా వ్యక్తం చేసింది. ఈనెల 21 నుంచి 28 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగే ఈ టోర్నీ గ్రూప్-1డిలో డెన్మార్క్, ఇండోనేషియా జట్లతో ప్రారంభ మ్యాచ్‌లు ఆడనున్న విషయాన్ని ఆమె ప్రస్తావించింది. అన్ని రకాలుగా భారత్ బలంగా ఉందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ నుంచి సైనా నెహ్వాల్ వైదొలగినప్పటికీ, భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఒక జట్టులో ఒక మహిళా క్రీడాకారిణి మాత్రమే ఆడాల్సి ఉంటుందని గుర్తుచేసింది. కాబట్టి, సైనా జట్టులో లేకపోవడంపై ఆందోళన అవసరం లేదని చెప్పింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన విషయాన్ని గుర్తుచేయగా, ‘టాప్-3’లో స్థానంతో ఈ ఏడాదిని పూర్తి చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. ఇంతకు ముందు రెండో స్థానంలో ఉన్నాను కాబట్టి, నంబర్ వన్‌గా ఎదిగే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించింది.

చిత్రం.. పివి సింధు