క్రీడాభూమి

ఐపిఎల్‌లో అత్యల్ప స్కోర్లు (టాప్-10)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఇప్పటి వరకూ నమోదైన అత్యల్ప స్కోర్లలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆదివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై చేసిన 73 పరుగులది ఆరో స్థానం. తక్కువ స్కోర్ల జాబితా ‘టాప్-10’లో నాలుగు ఈ సీజన్‌లోనే నమోదుకావడం గమనార్హం. మొదటి పది తక్కువ స్కోర్ల జాబితా...
1. రాయల్ చారెంజర్స్ బెంగళూరు 9.4 ఓవర్లలో 49 (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కోలకతాలో 2017 ఏప్రిల్ 23న).
2. రాజస్థాన్ రాయల్స్ 15.1 ఓవర్లలో 58 (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కేప్ టౌన్‌లో 2009 ఏప్రిల్ 18న).
3. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 13.4 ఓవర్లలో 66 (ముంబయి ఇండియన్స్‌పై ఢిల్లీలో 2017 మే 6న).
4. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 17.1 ఓవర్లలో 67 (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై మొహాలీలో 2017 ఏప్రిల్ 30న).
కోల్‌కతా నైట్ రైడర్స్ 15.2 ఓవర్లలో 67 (ముంబయి ఇండియన్స్‌పై ముంబయిలో 2008 మే 16న).
5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 15 ఓవర్లలో 70 (రాజస్థాన్ రాయల్స్‌పై అబూదబీలో 2014 ఏప్రిల్ 26న).
6. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 15.5 ఓవర్లలో 73 (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై పుణేలో 2017 మే 14న).
7. కొచ్చి టస్కర్స్ కేరళ 16.3 ఓవర్లలో 74 (డక్కన్ చార్జర్స్‌పై కొచ్చిలో 2011 ఏప్రిల్ 27న).
8. చెన్నై సూపర్ కింగ్స్ 15.2 ఓవర్లలో 79 (ముంబయి ఇండియన్స్‌పై ముంబయిలో 2013 మే 5న).
9. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 19.1 ఓవర్లలో 80 (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హైదరాబాద్‌లో 2013 మే 4న).
10. రాజస్థాన్ రాయల్స్ (15.2 ఓవర్లలో 81 (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కోల్‌కతాలో 2011 ఏప్రిల్ 17న).