క్రీడాభూమి

పాకిస్తాన్ క్రికెట్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్‌తో రూసోలో జరిగిన చివరి, మూడో టెస్టు మ్యాచ్‌ని 101 పరుగుల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు సాధించిన పాక్ ఆతర్వాత వెస్టిండీస్‌ను 247 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 174 పరుగులకే కుప్పకూలినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల ఆధిక్యం కారణంగా విండీస్ ముందు 304 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయతే, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. రాస్టన్ ఛేజ్ అజేయ సెంచరీతో రాణించినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ తమ టెస్టు కెరీర్‌కు తెరదించారు
*