క్రీడాభూమి

మళ్లీ ఓడిన భారత జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యూకెకొ (న్యూజిలాండ్), మే 16: న్యూజిలాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. రెండు రోజుల క్రితం జరిగిన మొదటి మ్యాచ్‌లో 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత్ మరోసారి దారుణంగా విఫలమైంది. ఈసారి ఏకంగా 2-8 తేడాతో ఓడింది. భారత్ తరఫున లీలిమా మిన్జ్ (40 నిమిషం), అనుపా బర్లా (49వ నిమిషం) గోల్స్ సాధించగా, న్యూజిలాండ్‌కు మ్యాచ్ మూడో నిమిషంలోనే సమంతా హారిసన్ గోల్‌ను అందించింది. ఆతర్వాత స్టార్ స్ట్రయికర్ స్టాసీ మిచెల్సెన్ హ్యాట్రిక్‌తో అదరగొట్టింది. ఆమె 21, 30, 42 నిమిషాల్లో గోల్స్ సాధించడంతో పటిష్టమైన స్థితికి చేరుకున్న న్యూజిలాండ్ ఆతర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగించింది. కిర్‌స్టెన్ పియర్స్ (52వ నిమిషం), మాడిసన్ డొయర్ (56వ నిమిషం) నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోల్స్ చేశారు. మొదటి గోల్‌ను అందించిన సమంతా హారిసన్ 56వ నిమిషంలోనే మరో గోల్ చేసింది. స్ట్ఫోనీ డికిన్స్ 60వ నిమిషంలో గోల్ సాధించి, కివీస్ ఆధిక్యాన్ని 8-2కు పెంచింది. ఆ జట్టు ఇదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది.
మొదటి మ్యాచ్‌తో పోలిస్తే రెండో మ్యాచ్ లో భారత్ మరింత అధ్వాన్నంగా మారింది. రక్షణ విభాగంలో లుకలుకలు స్పష్టంగా కని పించాయ. ప్రత్యర్థుల దూడుకును ఆ డ్డుకోవడంలో విఫలమైన భారత్, తా ను దాడులకు దిగి గోల్స్ చేయలేక పోయంది. అటాకింగ్, డిఫెన్స్ విభా గాల్లో రాణించలేకపోవడంతో, భారీ తేడాతో ఓటమి తప్పలేదు. కెప్టెన్ రాణి గానీ, ఇతర ఫార్వర్డ్స్‌గానీ తమకు లభిం చిన అవకాశాలను సద్వినియోగం చే సుకోలేకపోవడం కూడా భారత్ ఓట మికి ఒక కారణం. అంతేగా, పరస్పర అవగాహన లోపించిన కారణంగా భా రత జట్టు సరైన సమయంలో పుంజు కోలేకపోయంది. సిరీస్‌లో 0-2 తేడా తో వెనుకబడింది.