క్రీడాభూమి

భారత్, లెబనాన్ ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: భారత్, లెబనాన్ జట్ల మధ్య వచ్చేనెల 7న జరగాల్సిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్లకు వీసా లభించలేదని, అందుకే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు వారు రాలేకపోతున్నారని లెబనాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సమాచారం అందించిందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) మంగళవారం ఒక ప్రకటనో తెలిపింది. బెంగళూరులో జూన్ 13న కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న భారత్‌కు ఈ పరిణామాన్ని ఎదురుదెబ్బగా అభివర్ణించింది. ఈ పరిణామంతో నిరాశ చెందామని, అయినప్పటికీ, ఆసియా కప్ పోటీల్లో భారత జట్టుపై దీని ప్రభావం ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది.