క్రీడాభూమి

ఆత్మవిశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడంతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని బజరంగ్ పునియా అన్నాడు. గాయాల కారణంగా చాలా కాలం విశ్రాంతి తీసుకున్న భజరంగ్ ఇక్కడ జరిగిన ఆసియా రెజ్లింగ్ 65 కిలోల విభాగం ఫైనల్‌లో కొరియాకు చెందిన సిగెచుల్ లీని 6-2 పాయింట్ల తేడాతో ఓడించి, స్వర్ణ పతకం సాధించిన బజరంగ్ బుధవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌లో మొట్టమొదటిసారి స్వర్ణాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. రాబోయే రోజుల్లో, అంతర్జాతీయ టోర్నీల్లోనూ రాణించి, పతకాలు సాధించాలన్నదే తన లక్ష్యమని అన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జరిగే ప్రపంచ రెజ్లింగ్‌పై దృష్టి కేంద్రీకరించి, సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. ఏదైనా టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదని వ్యాఖ్యానించాడు.