క్రీడాభూమి

ముంబయదే ఆధిక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ 20 పర్యాయాలు తలపడ్డాయి. వాటిలో ముంబయి 15 విజయాలు సాధిస్తే, నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్‌లను గెల్చుకుంది. 2008లో జరిగిన మొదటి ఐపిఎల్ రెండు మ్యాచ్‌ల్లో నైట్ రైడర్స్‌ను వరుసగా ఏడు, ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. 2009లోనూ రెండు గ్రూప్ మ్యాచ్‌లను, 92, 9 పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. 2010లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒక మ్యాచ్‌ని ముంబయి ఏడు వికెట్ల తేడాతో గెల్చుకుంటే, మరో మ్యాచ్‌ని నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో తన ఖాతాలో వేసుకుంది. 2011లో ముంబయి ఆధిపత్యం కొనసాగింది. రెండు మ్యాచ్‌ల్లో మొదటి దానిని 5 వికెట్లు, రెండో దానిని 4 వికెట్లు తేడాతో గెలిచింది. 2012లో తిరిగి మిశ్రమ ఫలితం వెల్లడైంది. ఒక మ్యాచ్‌లో ముంబయి 27 పరుగుల తేడాతో, మరో మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 32 పరుగుల తేడాతో విజయాలు సాధించాయి. 2013లోనూ అలాంటి ఫలితమే పునరావృతమైంది. తొలి మ్యాచ్‌ని ముంబయి 5 వికెట్ల తేడాతో గెల్చుకుంటే, రెండో మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 65 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. 2014లో ముంబయి అనూహ్యంగా విఫలమైంది. మొదటి మ్యాచ్‌ని 41 పరుగులు, రెండో మ్యాచ్‌ని 6 వికెట్ల తేడాతో చేజార్చుకుంది. 2015లో మొదటి మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో కోల్పోయినప్పటికీ, రెండోమ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆతర్వాత ముంబయి ఇప్పటి వరకూ వెనుదిరిగి చూసుకోలేదు. 2016లో రెండు గ్రూప్ మ్యాచ్‌లను ఆరేసి వికెట్ల ఆధిక్యంతో గెల్చుకుంది. ఈ సీజన్ గ్రూప్ దశలో మొదటి గ్రూప్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు, రెండో మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో విజయాలను సాధించింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌గా పిలిచే సెమీ ఫైనల్‌లో ముంబయికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.