క్రీడాభూమి

రొనాల్డో ‘డబుల్’ సెల్టాపై రియల్ మాడ్రిడ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 18: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో భాగంగా సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియనొ రొనాల్డో రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో రియల్ మాడ్రిడ్ తన సమీప ప్రత్యర్థి బార్సిలోనా కంటే మూడు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. టైటిల్ సాధించేందుకు మరో పాయింట్ దూరంలో ఉంది. సెల్టాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 10వ నిమిషంలోనే తొలి గోల్ చేసిన రొనాల్డో 48వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ప్రథమార్ధం ముగిసే సమయానికి రియల్ మాడ్రిడ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కొంత సేపు ఎదురుదాడికి దిగిన సెల్టాకు 69వ నిమిషంలో ఒక గోల్ లభించింది. జాన్ గుడెఫి సాధించిన గోల్‌తో ఊపిరి పీల్చుకున్న సెల్టా అదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ, రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ సెల్టాను ఆత్మరక్షణలో నెట్టారు. కరీం బెంజిమా 70వ నిమిషంలో, టోనీ క్రూస్ 88వ నిమిషంలో గోల్స్ చేయడంతో, రియల్ మాడ్రిడ్ 4-1 ఆధిక్యంతో మ్యాచ్‌ని ముగించింది.

భారత హాకీ జట్టు
మన్‌ప్రీత్‌కు పగ్గాలు
న్యూఢిల్లీ, మే 18: హాకీ వరల్డ్ గ్రూప్ సెమీ ఫైనల్‌సహా వచ్చే మూడు నెలల కాలంలో భారత జట్టుకు హాఫ్ బ్యాక్ మన్‌ప్రీత్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జర్మనీలో జరిగే మూడు దేశాలు పాల్గొనే ఇన్విటేషషనల్ టోర్నీలో తొలుత భారత జట్టు పాల్గొంటుంది. అనంతరం జర్మనీలోనే వరల్డ్ హాకీ సెమీ ఫైనల్స్‌లో ఆడుతుంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రీజేష్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, జట్టు పగ్గాలు మన్‌ప్రీత్‌కు దక్కాయి.

ఫాంగిసోపై వేటు
జొహానె్నస్‌బర్గ్, మే 18: నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ ఉన్నదన్న కారణంగా దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆరోన్ ఫాంగిసోను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దక్షిణాఫ్రికా దేశవాళీ టోర్నమెంట్ మొమెంటమ్ వనే్డ కప్‌లో అతను హైవెల్డ్ లయన్స్‌కు ప్రాతినిథ్యం వహించి, వారియర్స్‌పై 38 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనే అతను బౌలింగ్ చేసే విధానం అనుమానంగా ఉందన్న ఫిర్యాదు రావడంతో అతనిపై వేటు పడింది. కెరీర్‌లో అతను ఇప్పటి వరకూ 16 వనే్డ ఇంటర్నేషనల్స్, 9 టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.

నాదల్‌కు గాయం!
రోమ్, మే 18: ఫ్రెంచ్ ఓపెన్ సమీపిస్తున్న సమయంలో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌కు ఫిట్నెస్ సమస్య తలెత్తడం చర్చనీయాంశమైంది. ఇక్కడ జరుగుతున్న రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో తన దేశానికే చెందిన నికొలస్ అల్మాగ్రోతో అతను తలపడ్డాడు. మొదటి సెట్ తొలి గేమ్‌లో 30-0 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఆ దశలో కాలి కండరాలు బెణకడంతో అతను నడవలేకపోయాడు. మ్యాచ్ నుంచి వైదొలగిన అతను అల్మాగ్రో సాయంతో కోర్టును నుంచి బయటకు వెళ్లాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను తొమ్మిది పర్యాయాలు కైవసం చేసుకొని, ఈసారి రేసులో ముందుంటాడని అనుకున్న నాదల్ హఠాత్తుగా గాయపడడం అతని ఫిట్నెస్‌పై అనుమానాలు పెంచుతున్నది.