క్రీడాభూమి

కోలుకున్న మార్క్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మే 24: గత నెల 11న జరిగిన బాంబు దాడిలో గాయపడిన బొరుసియా డార్ట్‌మండ్ ఆటగాడు మార్క్ బర్‌త్రా కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సంపాదించినట్టు అధికారులు ప్రకటించగా, అతను వెర్డెర్ బ్రెమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొనాకాతో చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని ఆడేందుకు వెళుతున్న డార్ట్‌మండ్‌పై బాంబు దాడి జరిగినప్పుడు మార్క్ చేతికి గాయమైంది. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే డార్ట్‌మండ్ జట్టు మొనాకాతో మ్యాచ్ ఆడింది. కానీ, తీవ్రమైన ఒత్తిడి కారణంగా మ్యాచ్‌ని 2-3 తేడాతో చేజార్చుకుంది. అయితే, మార్క్ ఆసుపత్రి నుంచి విడుదలైన రోజునే ఎన్‌ట్రాచ్ ఫ్రాంక్‌ఫర్ట్‌తో జరిగిన మ్యాచ్‌ని 3-1 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ మగిసిన వెంటనే మార్క్ ధరించే ఐదో నంబర్ జెర్సీని చేత్తో పట్టుకొని, డార్ట్‌మండ్ ఆటగాళ్లు విక్టరీ ల్యాప్ పూర్తి చేసి, అతని పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, గాయం తీవ్రమైనది కాకపోవడంతో, మార్క్ త్వరగానే కోలుకున్నాడు. మళ్లీ తన జట్టుకు మ్యాచ్‌లు ఆడడం మొదలుపెట్టాడు.