క్రీడాభూమి

అశ్విన్‌కు సియెట్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్ఠాత్మకమైన సియెట్ క్రికెట్ రేటింగ్ (సిసిఆర్) ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అతను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆర్‌పిజి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా నుంచి అందుకున్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో ఇటీవల స్వదేశంలో జరిగిన మొత్తం 13 టెస్టుల్లో టీమిండియా 10 విజయాలు సాధించింది. జట్టు ప్రతి విజయంలోనూ అశ్విన్ కీలక భూమిక పోషించాడు. గత 12 నెలల్లో అతను 99 వికెట్లు పడగొట్టాడు. కాగా, యంగ్ ప్లేయర్ అవార్డు భారత యువ ఆటగాడు శుభం శర్మకు లభించింది. భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన వనే్డ సిరీస్‌లో అతను అద్భుత ప్రతిభ కనబరిచాడు.
చాంపియన్స్ ట్రోఫీకి రెడీ
క్రికెట్ నుంచి సుమారు రెండు నెలల విరామం తీసుకున్న తాను చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. సరికొత్త ఎత్తుగడలతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతానని ధీమా వ్యక్తం చేశాడు. సియెట్ అవార్డును స్వీకరించిన అతను పిటిఐతో మాట్లాడుతూ తాను మొట్టమొదటిసారి సునీల్ గవాస్కర్ నుంచి చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఎంతో ఆనందించానని అన్నాడు. గవాస్కర్‌తో కలిసి వేదిక పంచుకున్నప్పుడు ఆ సంఘటనే గుర్తుకొచ్చిందని చెప్పాడు. తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను అతను ప్రశంసించాడు. విజయ్ హజారే ట్రోఫీలో సుందర్ చక్కటి ప్రతిభ కనబరిచాడని, అదే విధంగా ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌కు అద్భుతమైన సేవలు అందించాడని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి తనతోపాటు జట్టులోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని అశ్విన్ చెప్పాడు.