క్రీడాభూమి

ఐటి డెల్రే బీచ్ ఓపెన్‌లో పేస్ జోడీ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెల్రే బీచ్ (అమెరికా): అమెరికాలో జరుగుతున్న డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి జెరేమీ చార్డీ (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన నాలుగో సీడ్ ఎరిక్ బటొరాక్, స్కాట్ లిప్‌స్కీ జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన తొలి సెట్‌ను 6-4 తేడాతో కైవసం చేసుకున్న పేస్, చార్డీ ఆ తర్వాత రెండో సెట్‌లో 7-5 తేడాతో ప్రత్యర్ధులను ఓడించారు. సెమీస్‌లో స్థానం కోసం పేస్ జోడీ మార్సెల్ గ్రానోలర్స్ (స్పెయిన్), శామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జంటతో తలపడనుంది.