క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ టైటిల్‌పై కోహ్లీ సేన గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ చేరింది..
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం లండన్ చేరింది. విమానాశ్రయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

లండన్, మే 25: మినీ ప్రపంచ కప్‌గా పిలిచే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్‌పై గురిపెట్టి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. జూన్ ఒకటో తేదీ నుంచి మొదలైన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో డిఫెడింగ్ చాంపియన్ కాబట్టి, సహజంగానే భారత్‌పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. కోహ్లీతోపాటు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ చాంపియన్‌షిప్‌తోపాటు, చాంపియన్స్ ట్రోఫీని కూడా గెల్చుకున్న అనుభవంతో ఒక మహా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగే భారత్ బలమన్నది అందరికీ తెలిసిన రహస్యం. చాలాకాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన యువరాజ్ సింగ్ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ సాధించిన తర్వాత తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడనుండడం ఆసక్తిని రేపుతున్నది. యువ, సీనియర్ ఆటగాళ్లతో సమతూకంగా ఉన్న టీమిండియా టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
బలహీనతలు
కాగితంపై బలంగా కనిపిస్తున్నప్పటికీ, భారత జట్టును వేధిస్తున్న బలహీనతలు లేకపోలేదు. వాటిలో ముఖ్యమైనది నిలకడ లేమి. ఎవరు ఎప్పుడు రెచ్చిపోతారో? ఎప్పుడు డీలాపడతారో? చెప్పలేని పరిస్థితి. దీనికితోడు ఇటీవల ముగిసిన పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో విరామం లేకుండా ఆడడం వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసటకు గురయ్యారు. సుమారు నెలన్నరపాటు ఏదైనా టూర్‌కు వెళ్లివస్తే, సీనియర్ ఆటగాళ్లు తదుపరి టూర్ లేదా సిరీస్ నుంచి విశ్రాంతి కోరిన సంఘటనలు చాలానే ఉన్నాయి. భారీగా డబ్బు వస్తుంది కాబట్టి, ఐపిఎల్‌లో ఆడిన తర్వాత ‘అలసట’ అనే పదానే్న మరచిపోయినట్టు జట్టులోని ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తున్నారు. ఐపిఎల్‌లో ఫిట్నెస్ సమస్యలు తలెత్తడం కూడా కొంత మంది క్రికెటర్లను వేధిస్తున్న సమస్య. దీనికితోడు కొంత మంది ఫామ్‌ను కోల్పోయారు. శిఖర్ ధావన్, అజింక్య రహానే వంటి స్టార్లు గతంలో మాదిరి అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించడం లేదు. చాంపియన్స్ ట్రోఫీలో వీరు ఎంత వరకూ రాణిస్తారో చూడాలి. రోహిత్ శర్మ గాయం కారణంగా చాలాకాలం విశ్రాంతి తీసుకొని, ఐపిఎల్‌తో మళ్లీ క్రికెట్‌ను మొదలుపెట్టాడు. ముంబయి ఇండియన్స్‌కు నాయకత్వం వహించిన అతను టైటిల్‌ను అందుకున్నప్పటికీ, స్వయంగా ఫామ్‌లో లేడన్నది తిరుగులేని నిజం. ఫిట్నెస్ సమస్య తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. మొత్తం మీద బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో, నిలకడలేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా అదే స్థాయిలో సమస్యలు ఎదురుకావచ్చు.
ఆశాకిరణాలు
ఉజ్వల భవిష్యత్తు ఉన్న చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. పదో ఐపిఎల్‌లో చక్కటి ప్రతిభ కనబరచిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులు ఇంగ్లాండ్‌లో వాతావరణం, పిచ్‌ల తీరును తమకు అనుకూలంగా మార్చుకొని, బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తాడరని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. బంతిని స్టంప్స్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల బుమ్రా చాంపియన్స్ ట్రోఫీపై బలమైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అన్ని అంశాలు కలిసొస్తే, కోహ్లీ బృందం ట్రోఫీతోనే వెనక్కు వస్తుంది.