క్రీడాభూమి

ధోనీకున్న అనుభవం నాకు లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: భారత క్రికెట్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో అనుభవజ్ఞుడని, జట్టుకు ఎన్నో వివిష్ఠ సేవలు అందించాడని ప్రశంసించిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో స్థానం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీకున్నంత అనుభవం తనకు లేదా అని జాతీయ సెలక్టర్లను సూటిగా ప్రశ్నించాడు. ధోనీకి ఎన్నో ప్రత్యేకావకాశాలున్నాయని, అలాంటి సదుపాయాలేవీ తనకు లేదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ వాపోయాడు. ధోనీ అనుభవజ్ఞుడని, అంతేగాక, సంక్లిష్టమైన సమయాల్లో సరైన సూచనలు ఇవ్వగలడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యాలను అతను ఈ సందర్భంగా గుర్తుచేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి ధోనీని ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణం అదే అయితే, తనకు కూడా అంతటి అనుభవం ఉందని, సూచనలు ఇవ్వగలనని వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ ఫైనల్‌కు తనను ఎంపిక చేయకపోవడంపైన కూడా భజ్జీ అసహనం వ్యక్తం చేశాడు. తాను అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురయ్యానని ఆరోపించాడు.