క్రీడాభూమి

‘దబాంగ్’ చేతిలో ‘బుల్స్’ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: ప్రో-కబడ్డీ లీగ్ (పికెఎల్) మూడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు మళ్లీ అద్భుత విజయంతో పుంజుకుంది. గురువారం పాట్నాలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 35-21 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను మట్టికరిపించి ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వర్థమాన ఆటగాడు కె.సెల్వమణితో కలసి ఫైవ్-స్టార్ రైడర్ కషిలింగ్ అడకే దబాంగ్ ఢిల్లీ జట్టును విజయపథంలో నడిపాడు. ఆరంభం నుంచే విజృంభించి ఆడిన ఢిల్లీ జట్టు ప్రథమార్థం ముగిసే సమయానికే 16-7 పాయింట్ల తేడాతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. ప్రథమార్థంలో కషిలింగ్‌తో పాటు మంచి రైడర్‌గా పేరు పొందిన సుర్జీత్ నర్వాల్ కూడా పాయింట్లు సాధించడంలో విఫలమైనప్పటికీ దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ విభాగం ఎంతో మెరుగైన ప్రదర్శనతో ఆ లోటును భర్తీ చేసింది. ఆ తర్వాత ద్వితీయార్థంలోనూ జోరు కొనసాగించిన దబాంగ్ ఢిల్లీ జట్టు సమష్ఠిగా రాణించి 35-21 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. దీంతో ప్రస్తుత సీజన్ రెండో లెగ్ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్న దబాంగ్ ఢిల్లీ జట్టు తమ ఖాతాలో ఏడు పాయింట్లను జమచేసుకోగా, ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు బుల్స్ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి.