క్రీడాభూమి

డోప్ టెస్టులో రోహిత్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: యువ జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ డోప్ పరీక్షలో దోషిగా తేలాడు. దీనితో ఆసియా యూత్ అత్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అతను సాధించిన రజత పతకాన్ని అధికారులు రద్దు చేశారు. 16 ఏళ్ల యాదవ్ నిరుడు జరిగిన ప్రపంచ స్కూల్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, 76.11 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి కొత్త మీట్ రికార్డు సృష్టించాడు. కాగా, ఈ నెల 23న జరిపిన పరీక్షలో రోహిత్ నిషిద్ధ ఉత్ప్రేరకం ‘స్టానోజొలొల్’ను వాడినట్టు స్పష్టమైందని జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఇచ్చిన నివేదిక ఆధారంగా అతనిపై నిషేధం విధించామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) ప్రకటించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సందర్భంగా ఈ పరీక్షను నిర్వహించినట్టు తెలిపింది.