క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ కళావిహీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 27: స్టేడియాలకు ప్రేక్షకులను ఆకర్షించే సత్తావున్న కీలక స్టార్లు లేకపోవడంతో ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ కళావిహీనంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఆదివారం నుంచి మొదలయ్యే ఈ ‘క్లే కోర్టు’ గ్రాండ్ శ్లామ్ సమరంలో మరియా సెరెనా విలియమ్స్, మరియా షరపోవా, రోజర్ ఫెదరర్ తదితరులు ఆడకపోవడం సహజంగానే అభిమానులను నిరాశ పరుస్తున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సెరెనా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఆతర్వాత, వచ్చే ఏడాది తిరిగి కెరీర్‌ను కొనసాగిస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందే తాను గర్భవతినన్న విషయం ఆమెకు తెలిసింది. దీనితో ఆ టోర్నీలో సక్రమంగా ఆడగలనా? లేదా? అనే అనుమానించినప్పటికీ, జాగ్రత్తగా ఆడడమేగాక, టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకుంది. ప్రస్తుతం ప్రతివారం సెల్ఫీలు తీసుకుంటూ, బిడ్డ పెరుగుదలను చూసుకుంటూ బిజీగా ఉంది. తన బిడ్డ రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్తున్న 35 ఏళ్ల సెరెనా, 2018లో కెరీర్‌ను కొనసాగిస్తానని, రిటైర్మెంట్ ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పింది. బహుశా వచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె ఆడవచ్చు. ప్రస్తుతానికి ఆమె అభిమానులకు నిరాశ తప్పదు.
విశ్రాంతి కోసం..
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న 35 ఏళ్ల రోజర్ ఫెదరర్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక, హార్డ్, గ్రాస్ కోర్టు టోర్నీలపై దృష్టిని కేంద్రీకరించడానికి వీలుగా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకొని, పురుషుల టెన్నిస్‌లో సరికొత్త రికార్డును సృష్టించిన అతనికి ఫ్రెంచ్ ఓపెన్ కేవలం ఒకసారి మాత్రమే దక్కింది. 2009 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను రాబిన్ సోల్డరింగ్‌ను 6-1, 7-6, 6-4 తేడాతో ఓడించి టైటిల్ సాధించాడు. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ అతనికి ఫ్రెంచ్ ఓపెన్ దక్కలేదు. 2006, 2007, 2008 సంవత్సరాల్లో వరుసగా మూడు పర్యాయాలు అతను ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్ ట్రోఫీకి పరిమితమయ్యాడు. 2009లో విజేతగా నిలవగా, 2011లో చివరిసారి ఫైనల్ చేరి, రాఫెల్ నాదల్ చేతిలో ఓడాడు. వయసు మీదపడుతున్నప్పటికీ, యువ ఆటగాళ్లతో హోరాహోరీగా పోరాడే తత్వం ఉన్న ఫెదరర్ ఆటను చూసేందుకు అభిమానులు ఎగబడతారు. హార్డ్, గ్రాస్ కోర్టుల్లో సమర్థుడిగా పేరు సంపాదించిన అతను క్లే కోర్టుపై అదే తీరులో ఆడడం లేదు. అయితే, చివరి వరకూ ఓటమిని అంగీకరించని తత్వమే అతనిని క్లే కోర్టు గ్రాండ్ శ్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అభిమానులను ఆకర్షించే స్టార్‌గా నిలబెట్టింది. ఈసారి అతను రావడం లేదన్న వార్త ఎంతో మంది అభిమానులను నిరాశ పరుస్తున్నది. ఒక గొప్ప యోధుడి పోరాటాన్ని చూసే అవకాశం చేజారింది.
షరపోవా సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న కారణంగా ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో, పేరుప్రఖ్యాతులున్న వారికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మెయిన్ డ్రాలో చేర్చడం ఆనవాయితీ. కానీ, ఫ్రెంచ్ ఓపెన్ అధికారులు ఆమెకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. క్వాలిఫయింగ్ పోటీల ఆడకపోవడంతో, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాన్ని షరపోవా కోల్పోయింది. తన ఆటకంటే అందంతోనే ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది వాస్తవం. గ్లామరస్ గర్ల్ లేని ఫ్రెంచ్ ఓపెన్ కళావిహీనం కావడం ఖాయం.

యువ కెరటాలు..
పారిస్: వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ బరిలో లేకపోయినప్పటికీ, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్ వంటి సీనియర్లకు గట్టిపోటీనిచ్చేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. దూసుకొస్తున్న ఇలాంటి యువ కెరటాల్లో 20 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్, 23 ఏళ్ల డామినిక్ థియేమ్ పేర్లను ముందుగా ప్రస్తావించాలి. గత ఆదివారం జరిగిన ఇటాలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో బరిలోకి దిగిన అతను మూడో రౌండ్ వరకూ చేరాడు. వింబుల్డన్‌లో మూడో రౌండ్, యుఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్ వరకు వెళ్లిన అతని ప్రస్థానం ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌తో ముగిసింది. ఈసారి అతను మేటి ఆటగాళ్లకు సవాళ్లు విసరడం ఖాయంగా కనిపిస్తున్నది.
నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్ చేరి అందరి దృష్టిని ఆకట్టుకున్న థియేమ్ ఇటీవలే రాఫెల్ నాదల్‌పై విజయం సాధించి, ‘జెయింట్ కిల్లర్’గా తనను తాను నిరూపించుకున్నాడు. నిరుడు అతను ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్, వింబుల్డన్‌లో రెండో రౌండ్, యుఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ వరకూ చేరగలిగాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు సుమారు పది రోజుల ముందు నాదల్‌ను ఓడించి, రొలాండ్ గారోస్‌లో ఆధిపత్యాన్ని కనబరచే అవకాశాలు తనకు ఉన్నాయని నిరూపించాడు. మొత్తం మీద సమర్థులైన ఇద్దరు యువ ఆటగాళ్ల నుంచి సీనియర్లకు గట్టి పరీక్ష తప్పకపోవచ్చని విశే్లషకుల అభిప్రాయం.
టాప్ సీడ్స్..
పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్, స్టానిస్లాస్ వావ్రిన్కా వరుసగా ప్రపంచ ర్యాంకింగ్స్ మొదటి మూడు స్థానాల్లో నిలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ ర్యాంకింగ్స్‌ను సంపాదించారు. రాఫెల్ నాదల్నాలుగో స్థానంలో ఉండగా, పోటీల నుంచి వైదొలగిన ఫెదరర్‌ది ఐదో స్థానం. గర్భవతినైన కారణంగా మహిళల సింగిల్స్‌లో పాల్గొనడం లేదని సెరెనా విలియమ్స్ ప్రకటించిన నేపథ్యంలో సీడింగ్స్‌లో ఆమె స్థానాన్ని కరొలినా ప్లిస్కోవా దక్కించకుంది. ఏంజెలిక్ కెర్బర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సిమోనా హాలెప్ మూడో స్థానంలో ఉంది. నిరుటి విజేత గార్బినె ముగురుజా నాలుగు, ఎలిని స్టివటోనికా ఐదు సీడింగ్స్ మ్యాచ్‌లు ఆడతారు.