క్రీడాభూమి

జర్మనీకి భారత హాకీ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 29: యువ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు జర్మనీకి సోమవారం బయలుదేరి వెళ్లింది. జూన్ ఒకటి నుంచి జర్మనీలో ప్రారంభమయ్యే మూడు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఈ జట్టు పాల్గొంటుంది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి జర్మనీకి బయలుదేరిందని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు వీలుగా ఆటగాళ్లకు రెండు వారాల పాటు ఇక్కడ శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్టు తెలిపింది. అన్ని రకాలుగా సిద్ధమైన భారత జట్టులోని పలువురు యువ ఆటగాళ్లు ఉ న్నారని పేర్కొంది. అదే విధంగా సీనియర్ క్రికెట ర్లు కూడా ఉండడంతో, జట్టు అన్ని విధాలా బలం గా ఉందని తెలిపింది.

ముగురుజా ముందంజ
పారిస్: మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ గార్బినె ముగురుజా ముందంజ వేసింది. మొదటి రౌండ్‌లో ఆమె అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఫ్రాన్సిస్కా షియవోన్‌ను 6-2, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. టాప్ సీడ్ ఏంజిలిక్ కెర్బర్ ఎవరూ ఊహించని రీతిలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించగా, స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈ టోర్నీకి హాజరుకాలేదు. దీనితో ఈసారి మహిళల విభాగంలో టైటిల్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. రేసులో తాను ఉన్నానని ముగురుజా తొలి రౌండ్‌లో ప్రత్యర్థిని చిత్తుచేసిన విధానం స్పష్టం చేస్తున్నది. కాగా, ప్రస్తుతం 11వ ర్యాంకర్‌గా అడుగుపెట్టిన ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి మొదటి రౌండ్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ జైమీ ఫోర్లిస్‌పై 6-4, 3-6, 6-2 ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా, ఒసియానే డొడిడ్ 6-3, 6-2 స్కోరుతో కామిలా గ్లోర్గీపై గెలవగా, డొమినికా సిబుల్కొవా 6-2, 6-1 ఆధిక్యంతో లారా అరుబరెనాను ఓడించింది.