క్రీడాభూమి

చెత్తగా ఆడారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 5: భారత్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో చాలా చెత్తగా ఆడారంటూ సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మీడియా నిప్పులు చెరిగింది. వర్షం కారణంగా ఆటకు పదేపదే అంతరాయం ఏర్పడిన మ్యాచ్‌లో, డక్‌వర్డ్ లూయిస్ విధానం ప్రకారం లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్ధారించగా, ఛేదనలో విఫలమైన పాకిస్తాన్ 164 పరుగులకే ఆలౌటై, 124 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూడడం పాక్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. ఏ దశలోనూ భారత్‌కు గట్టిపోటీనిచ్చే స్థాయిలో ఆడలేదని ఒక పత్రిక పేర్కొంటే, కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అనాలోచితంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టు పరాజయానికి కారణమయ్యామని మరో పత్రిక దుయ్యబట్టింది. మొత్తం మీద పాక్ మీడియా యావత్తు జట్టు వైఫల్యాలను ఎండగట్టింది. ఇంజమాముల్ హక్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటి జట్టుతో పోలిస్తే ఇప్పటి జట్టు నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పించింది. వాహన్ రియాజ్, మహమ్మద్ అమీర్ అవుట్ ఫీల్డ్ పరిస్థితిని పట్టించుకోకుండా కింద పడడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మీడియా ధ్వజమెత్తింది. బౌలింగ్ నాసిరకంగా ఉంటే, బ్యాటింగ్ అంతకంటే అధ్వాన్నంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛేదించాల్సిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వ్యూహాత్మకంగా ఆడాల్సిన పాక్ క్రికెటర్లు అందుకు భిన్నంగా, నీరసపడిపోయారని పేర్కొంది. ఐసిసి చాంపియన్‌షిప్ టోర్నీలోనే వాహబ్ రియాజ్ పరమ చెత్త బౌలింగ్ విశే్లషణను నమోదు చేయడాన్ని పాక్ మీడియా పదేపదే ప్రస్తావించింది. అతను 8.4 ఓవర్లలో 87 పరుగులు సమర్పించుకొని, ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్ తినాషె సన్యంగరా 10 ఓవర్లలో 86 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. భారత్‌పై రియాజ్ అతని కంటే ఒక పరుగు ఎక్కువే ఇచ్చాడు. ఇదే విషయాన్ని పాక్ మీడియా హైలైట్ చేసింది. కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు అనుభవం తక్కువ కాబట్టి అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలన్న వాదన కూడా వినిపించింది. మొత్తం మీద భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌పై పాక్ మీడియా చాంపియన్స్ ట్రోఫీకి ఇదే ఫైనల్ అన్న రీతిలో హడావుడి చేసింది. జట్టు ఓటమిని జీర్ణించుకోలేక, ఆటగాళ్లపై విమర్శలకు దిగింది.

శిఖర్ ధావన్