క్రీడాభూమి

మణిపూర్ మణిపూస మళ్లీ బరిలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘మణిపూర్ మణిపూస’ మేరీ కోమ్ దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్లీ బాక్సింగ్ బరిలోకి దిగనుంది. మరికొద్ది రోజుల్లో మంగోలియాలో జరుగనున్న ఉలాన్‌బాటర్ కప్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారత మహిళా జట్టులో ఆమెకు చోటు కల్పించారు. మేరీ కోమ్ గత ఏడాది కాలం నుంచి బాక్సింగ్ పోటీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే ఏడుగురు సభ్యుల భారత పురుషుల జట్టుకు కామనె్వల్త్ క్రీడల రజత పతక విజేత ఎల్.దేవేంద్రో సింగ్ (52 కిలోలు) సారథ్యం వహించనున్నాడు. రెండుసార్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా రజత పతకాన్ని సాధించిన దేవేంద్రో సింగ్ లైట్ ఫ్లైవెయిట్ విభాగం నుంచి ఫ్లైవెయిట్ విభాగానికి మారుతున్న విషయం తెలిసిందే. దేవేంద్రో సింగ్‌తో పాటు కింగ్స్ కప్ టోర్నీలో రెండుసార్లు పసిడి పతకాలతో సత్తా చాటుకున్న కె.శ్యామ్ కుమార్ (49 కిలోలు)కు కూడా భారత జట్టులో చోటు లభించింది. ఆసియా చాంపియన్‌షిప్స్ సెలెక్షన్‌కు దేవేంద్రో, శ్యామ్ కుమార్ దూరమవడంతో ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో జర్మనీలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వీరిద్దరికీ చోటు లభించలేదు. అయితే ఉలాన్‌బాటర్ కప్ టోర్నీలో తలపడే భారత పురుషుల జట్టులో వీరిద్దరితో పాటు ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండా మెమోరియల్ టోర్నీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొహమ్మద్ హస్సముద్దీన్ (56 కిలోల బాంటమ్ వెయిట్), ఏషియన్ యూత్ గేమ్స్ రజత పతక విజేత అంకుష్ దహియా (60 కిలోల లైట్ వెయిట్), కింగ్స్ కప్ టోర్నీలో రెండుసార్లు కాంస్య పతకాలను గెలుచుకున్న రోహిత్ తొకాస్ (64 కిలోల లైట్ వెల్టర్‌వెయిట్)లకు కూడా చోటు లభించింది.
ఇవీ భారత జట్లు
పురుషులు: కె.శ్యామ్ కుమార్ (49 కిలోలు), ఎల్.దేవేంద్రో సింగ్ (52 కిలోలు), మొహమ్మద్ హస్సముద్దీన్ (56 కిలోలు), అంకుష్ దహియా (60 కిలోలు), రోహిత్ తొకాస్ (64 కిలోలు), దుర్యోధన్ (69 కిలోలు), జైదీప్ (75 కిలోలు).
మహిళలు: ఎంసి.మేరీ కోమ్ (51 కిలోలు), ప్రియాంకా చౌదరి (60 కిలోలు), కళావంతి (75 కిలోలు).