క్రీడాభూమి

కూపర్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కెవిన్ కూపర్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందన్న ఫిర్యాదు అందినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. 27 ఏళ్ల కూపర్ వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని సంపాదించుకోలేదు. అయితే, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను ట్రినిడాడ్ అండ్ డొబాగో తరఫున ఆడుతున్నాడు. 2014లో ఒకసారి అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురైన అతను ఆతర్వాత బయోమెకానిక్ పరీక్షకు హాజరై క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చినట్టు ఐసిసి పేర్కొంది. ప్రస్తుతానికి అతనిపై ఐసిసి ఇంకా ఎలాంటి చర్యను ప్రకటించలేదు. ఒకవేళ సస్పెండ్ చేస్తే అతను మరోసారి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించే పునరావాస శిబిరానికి హాజరుకావాల్సి ఉంటుంది.