క్రీడాభూమి

అభిమానుల మద్దతే గెలిపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 8: ఎడ్జిబాస్టన్ స్టేడియానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు ఇచ్చిన మద్దతే తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అదే తమను గెలిపించిందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కి వర్షం కారణంగా ఆటంకం ఏర్పడగా, చివరి క్షణం వరకూ వేచి చూసిన తర్వాత, ఆట కొనసాగడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన అంపైర్లు పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఆ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచినట్టు తెలిపారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను పాకిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది ఓవర్లకు 219 పరుగులకే కట్టడి చేసింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఇంత కంటే సరిగ్గా 100 పరుగులు ఎక్కువ సమర్పించుకుంది. కాగా, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి, 27 ఓవర్లలో మూడు వికెట్లకు 119 పరుగులు చేసింది. ఆతర్వాత ఆట కొనసాగకపోవడంతో, డక్‌వర్త్ లూయిస్ విధానంలో పరుగుల తేడాను లెక్కగట్టి, పాకిస్తాన్ 19 పరుగుల తేడాతో గెలిచిందని ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సర్ఫ్‌రాజ్ విలేఖరులతో మాట్లాడుతూ ఆసియన్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పాక్ అభిమానులు భారీగా తరలి వచ్చారని, వారు తమకు అనుకూలంగా నినాదాలు చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయాన్ని గురించి అతను మాట్లాడలేదు. అయితే, ఆ మ్యాచ్‌కి వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడడం తమకు నష్టాన్ని మిగిల్చిందని వాపోయాడు. అందుకే, ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా ఆడినట్టు చెప్పాడు. దక్షిణాఫ్రికాను ఓడించి, రేసులో కొనసాగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నదని తెలిపాడు.

చిత్రం.. సర్ఫ్‌రాజ్ అహ్మద్