క్రీడాభూమి

కివీస్‌పై బంగ్లా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డిఫ్, జూన్ 9: చాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగి న మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా శతకాలతో రాణించడంతో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడా తో విజయభేరి మోగించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ అందుకుంది. భా రత్‌ను శ్రీలంక భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ ఓడించ డాన్ని క్రికెట్ అభిమానులు మరిచిపోక ముందే ఈ టోర్నీలో బంగ్లా మరో సంచలన విజయాన్ని సాధించడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. రాస్ టేలర్ (63), కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (57) అర్ధ శతకాలు చేయడంతో కివీస్‌కు ఆ స్కోరు సాధ్యమైంది. బంగ్లా బౌలర్లలో మోసాడెక్ హొస్సే న్ మూడు ఓవర్లు బౌల్ చేసి, కేవలం 13 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్ 43 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు.
కివీస్‌ను ఓడించేందుకు 266 పరుగులు చేయా ల్సిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. తమీమ్ ఇక్బాల్ (0), సౌమ్య సర్కార్ (3), సబ్బీర్ ర హ్మాన్ (8), ముష్ఫికర్ రహీం (14) పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బం గ్లా ఒక దశలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయం ది. అయతే, షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా 224 పరు గుల రికార్డు భాగస్వామ్యంతో కోలుకుంది. 114 బంతులు ఎదు ర్కొని 115 పరుగులు చేసిన షకీబ్ జట్టు స్కోరు 257 పరుగుల వద్ద అవుటయ్యాడు. అప్పటికి బంగ్లాదేశ్ విజ యానికి తొమ్మిది పరుగు దూరంలో ఉంది. మోసాడెక్ హొస్సేన్ (7 నాటౌట్)తో కలిసి మహమ్మదుల్లా బంగ్లాదేశ్ ను విజయపథంలో నడిపించాడు. అతను 107 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 102 పరు గులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. షకీబ్‌తో కలిసి రికా ర్డు భాగస్వామ్యాన్ని అందించాడు.
బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా ఐదో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. బంగ్లాదేశ్ తరఫున వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2015లో ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో పాక్తిన్‌పై ముష్ఫికర్ రహీం, తమీమ్ ఇక్బాల్ 178 పరుగులు జోడించారు. ఆ రికార్డును షకీబ్, మహమ్మదుల్లా ఈ మ్యాచ్‌లో అధిగమించారు. వీరిద్దరూ సెంచరీలతో రాణించడంతో బంగ్లాదేశ్‌కు విజయం సాధ్యమైంది. ఇంతకు ముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, పాయంట్లను పంచుకోవాల్సి వచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు విజయాన్ని నమోదు చేసి, రెండు పాయంట్లు సంపాదించింది.