క్రీడాభూమి

పదో టైటిల్‌పై నాదల్ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ను ఇప్పటికే తొమ్మిది పర్యాయాలు గెల్చుకొని రికార్డు సృష్టించిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పదోసారి విజేతగా నిలవడంపై దృష్టి పెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో అతను స్టానిస్లాస్ వావ్రిన్కాను ఢీకొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకూ కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను సాధించిన నాదల్ ఖాతాలో తొమ్మిది రొలాండ్ గారోస్‌లో కైవసం చేసుకున్నవే. క్లే కోర్టుపై అసాధారణ ప్రతిభ కనబరిచే నాదల్‌కు వావ్రిన్కా ఎంత వరకూ పోటీనిస్తాడనేది చూడాలి. అయితే, 2014 ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాదల్‌ను ఓడించడంసహా ఎన్నో చిరస్మరణీయ విజయాలను సాధించిన వావ్రిన్కాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది వాస్తవం. అతను కెరీర్‌లో నాలుగో గ్రాండ్ శ్లామ్ విజయాన్ని నమోదు చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాదల్‌తో పోల్చడానికి వీల్లేకపోయినా అతని శక్తిసామర్థ్యాలు ఎలాంటి ఆటగాడినైనా ఇబ్బంది పెడతాయని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనదైన రోజున వావ్రిన్కా ఏ విధంగా చెలరేగిపోతాడో చాలా మంది స్టార్ ఆటగాళ్లకు అనుభవమే. దీనికి నాదల్ అతీతుడేమీ కాకపోవచ్చు. కానీ, ఫిట్నెస్ సమస్యలు లేకపోతే, క్లే కోర్టుపై నాదల్‌ను నిలువరించడం అనుకున్నంత సులభం కాదు. 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగు సార్లు, 2010 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఓపెన్‌ను సాధించడమే అతని సామర్థ్యానికి నిదర్శనం. వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను రెండేసిసార్లు, ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఒకసారి గెల్చుకొని కెరీర్ స్లామ్‌ను నమోదు చేసిన అతను ఈసారి పారిస్‌లో అతను టైటిల్‌ను తీసుకోవడం ఖాయమని క్రీడా పండితులు అంటున్నారు.
పంతొమ్మిదోసారి
నాదల్, వావ్రిన్కా ఒక మ్యాచ్‌లో ఢీ కొనడం ఇది 19వసారి. ఇప్పటి వరకూ జరిగిన 18 మ్యాచ్‌ల్లో నాదల్ 18 గెల్చుకుంటే, వావ్రిన్కా విజయాలు మూడు మాత్రమే. క్లే కోర్టు విషయానికి వస్తే, ఇంత వరకూ వీరిద్దరూ ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డారు. నాదల్ ఐదు తన ఖాతాలో వేసుకోగా, వావ్రిన్కా ఒకసారి గెలిచాడు. ఈ గణాంకాలు నాదల్‌ను ఫేవరిట్‌గా నిలబెడుతున్నాయి. ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప, నాదల్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద నాదల్ పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకుంటాడా లేక వావ్రిన్కాకు అప్పచెప్పి, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంటాడా అన్నది చూడాలి.

చిత్రం.. రాఫెల్ నాదల్