క్రీడాభూమి

రియోలో డైవర్లకు జికా భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరియో: ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న డైవర్స్‌ను జికా భయం వెంటాడుతున్నది. 46 దేశాలకు చెందిన 217 మంది స్విమ్మర్లు ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ డైవింగ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. దాదాపుగా అందరినీ జికా వైరస్ భయం వెంటాడుతున్నది. దోమ కాటువల్ల వ్యాపించే ఈ వైరస్ వల్ల విపరీత పరిణామాలు ఎదురవుతాయి. గర్భిణులు త్వరగా దీనిబారిన పడతారని, దీని ప్రభావం వల్ల పుట్టబోయే పిల్లల్లో మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలకే జికా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్త షికార్లు చేస్తున్నది. దీనితో మహిళా డైవర్లు ఆందోళన చెందుతున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న అమెరికా మహిళా డైవర్ అబీ జాన్‌స్టన్ అందరి కంటే ఎక్కువగా భయపడుతున్నది. తన వెంటనే దోమలను నివారించేందుకు ఉపయోగించే స్ప్రేని తీసుకెళుతున్నది. జికా వైరస్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న అబీ భయాన్ని చూసిన తర్వాత మిగతా వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం హెచ్చరిస్తుంటే, మహిళలంతా జికా తమకు కూడా సోకుతుందేమోనని ఆందోళన చెందడం విచిత్రం. అబీ లాంటి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.