క్రీడాభూమి

వింబుల్డన్‌కు షరపోవా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఈసారి వింబుల్డన్‌లో పాల్గొనడం లేదు. గాయం కారణంగా తాను క్వాలిఫయర్స్‌లో ఆడలేకపోతున్నానని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. నిషిద్ధ మాదక ద్రవ్యాం మాల్డోనియంను వినియోగించిన కారణంగా సస్పెన్షన్‌కు గురైన ఆమె, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టింది. అయితే, క్రీడాస్ఫూర్తికి విఘాతం గలిగించిన ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఇవ్వడాన్ని కొంత మంది క్రీడాకారిణులు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణాలు ఏవైనా ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఆమెకు వైల్డ్ కార్డ్‌ను నిరాకరించారు. దీనితో ఆగ్రహించిన ఆమె వింబుల్డన్‌లో తాను వైల్డ్‌కార్డ్‌ను కోరుకోవడం లేదని ప్రకటించింది. అవసరమైతే క్వాలిఫయర్స్‌లో ఆడి, మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తానని శపథం చేసింది. కానీ, గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, అందుకే, వింబుల్డన్‌కు హాజరుకావడం లేదని తాజా ప్రకటనలో ఆమె వెల్లడించింది.