క్రీడాభూమి

పరుషంగానే మాడ్లాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 12: జట్టు ప్రయోజనాల కోసం ఒక్కోసారి సహచరులతో పరుషంగా మాట్లాడక తప్పదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వారికి తమ బాధ్యతలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అయితే, పొరపాట్లు ఎక్కడ జరిగియానే విషయంలో స్పష్టత ఉండాలని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు. ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకపై భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమిపాలైన తర్వాత, ఎక్కడెక్కడ తప్పులు దొర్లాయో విశే్లషించుకున్నామని చెప్పాడు. తనతోసహా, ఎవరెవరు ఏఏ పొరపాట్లు చేశారో వివరించే సమయాల్లో సహచరులు ఒక్కోసారి బాధపడే అవకాశాలు లేకపోలేదని అన్నాడు. కానీ, జట్టును విజయ బాట పట్టించడానికి ఇది అత్యవసరమని తెలిపాడు. దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి, విజయం సాధించడంలో జట్టులోవని ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించారని ప్రశంసించాడు. ‘మెరుగైన ఆట ఆడేందుకే మమ్మల్ని ఎంపిక చేశారు. కోట్లాది మందిలో మాకు మాత్రమే ఈ అవకాశం దక్కిదంటే, ఆ స్థాయికి తగినట్టు రాణించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకే విషయాన్ని పదేపదే చెప్పించుకోవాల్సిన స్థితిలో ఎవరూ ఉండకూడదు. ఈ ఉద్దేశంతోనే నేను చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాను. నాతోసహా అందరి ఆటతీరును విశే్లషించుకున్నాం. జరిగిన పొరపాట్లను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను. ప్రతి ఒక్కరూ రాణించాల్సిన అవసరం ఉందని అన్నాను. దక్షిణాఫ్రికాపై సమష్టిగా రాణించడం వెనుక కారణం అదే’ అని కోహ్లీ వివరించాడు. జట్టులోని అందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి, ప్రతి చిన్న విషయాన్నీ వారికి వివరించాల్సిన అవసరం లేదన్నాడు. ఏం జరిగిందో, ఏం కోరుకుంటున్నామో చెప్తే అందరికీ అర్థమవుతుందని చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే స్థాయికి చేరిన ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తమనుతాము పోరాటాలకు సిద్ధం చేసుకుంటునే ఉంటారని కోహ్లీ వ్యాఖ్యానించాడు. లంక చేతిలో ఓడిన తర్వాత నెట్స్‌లో చాలా కష్టపడ్డామని, అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందామని తెలిపాడు.
ఎప్పుడూ శాంతంగానే లేను
ఎప్పుడూ శాతంగానే ఉండడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ స్పష్టం చేశాడు. కొన్ని సందర్భాల్లో తాను కూడా సహనం కోల్పోతానని చెప్పాడు. అయితే, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తనకు తెలుసునని అన్నాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నంత మాత్రాన ఏ దశలోనూ దూకుడును ప్రదర్శించకుండా, ప్రశాంతంగా ఉండాలన్న సూత్రమేమీ లేదని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సుమారు 24 మెయిడిన్లు వేశారు. ఈ విషయాన్ని ప్రస్తావించగా, నిజానికి తనకు గణాంకాల్లో ఆసక్తి లేదన్నాడు. అసలు ఆ విషయాన్ని తాను గమనించలేదని చెప్పాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని, సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని మాత్రమే తాము నిర్ణయించుకున్నామని, చివరి వరకూ అదే సూత్రాన్ని అనుసరించామని తెలిపాడు.