క్రీడాభూమి

సెమీ ఫైనల్‌కు పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను మూడు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లంకను 236 పరుగులకే ఆలౌట్ చేసిన పాక్ ఆతర్వాత లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో, ఏడు వికెట్లు కోల్పోయ ఛేదంచింది. ఒకానొక దశలో ఓటమి ఖాయంగా కనిపించినప్పటికీ, సర్ఫ్‌రాజ్ అహ్మద్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయపథంలో నడిపించాడు. మహమ్మద్ అమీర్ అతనికి చక్కటి సహకారాన్ని అందించి, తన జట్టు సెమీస్ చేరడానికి సహకరించాడు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మొదటి నుంచే తడబాటును ప్రదర్శించింది. 26 పరుగుల వద్ద ధనుష్క గుణతిలక (13)ను షోయబ్ మాలిక్ క్యాచ్ అందుకోగా జునైద్ ఖాన్ అవుట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనం ఆతర్వాత కూడా నిరాటంకంగా కొనసాగింది. ఓపెనర్ నిరోషన్ డిక్‌విల్లా క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ అతనికి ఎవరైన సరైన మద్దతును ఇవ్వలేకపోయారు. గుశాల్ మెండిస్ 27 పరుగులు చేసి, హసన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, దినేష్ చండీమల్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఫాహిం అష్రాఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కొంత సేపు పాక్ బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 54 బంతులు ఎదుర్కొన్న అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు. అమీర్ ఈ టోర్నమెంట్‌లో మొదటి వికెట్‌ను సాధించాడు. పించ్ హిట్టర్ ధనుంజయ డిసిల్వ ఒక పరుగు చేసి, జునైద్ ఖాన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు దొరికిపోయాడు. అంతవరకూ ఓపికతో ఆడిన డిక్‌విల్లా వరుసగా వికెట్లు కూలడంతో ఏకాగ్రత కోల్పోయి, అమీర్ బౌలింగ్‌లో సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతను 86 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్ల సాయంతో 73 పరుగులు సాధించాడు. తిసర పరెరా (1), సురంగ లక్మల్ (26), అసెల గుణరత్నే (27), నువాన్ ప్రదీప్ (1) పరుగుల వేటలో వికెట్లు పారేసుకున్నారు. లంక 49.2 ఓవర్లలో 236 పరుగులకే అలౌటైంది. లసిత్ మలింగ అప్పటికి తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ అమీర్, ఫాహిం అష్రాఫ్ చెరి రెండు వికెట్లు సాధించారు.
ఆరంభంలో దూడుకు
సవాళ్లు విసిరే లక్ష్యమేమీ కాకపోవడంతో, 237 పరుగులను సాధించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ మొదట్లో ఉత్సాహంగా ఆడింది. అజర్ అలీ, ఫక్రార్ జమాన్ మొదటి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ప్రమాదకంగా మారుతున్న వీరి భాగస్వామ్యాన్ని నువాన్ ప్రదీప్ దెబ్బతీశాడు. 36 బంతుల్లోనే, 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టి, 50 పరుగులు చేసిన ఫక్రార్ జమాన్‌ను అసెల గుణరత్నే క్యాచ్ అందుకోగా అతను పెవిలియన్‌కు పంపాడు. జట్టుకు అండగా నిలుస్తాడనుకున్న యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం ఎక్కువ సేపు లంక బౌలింగ్‌ను ప్రతిఘటించలేకపోయాడు. 18 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్‌తో 10 పరుగులు చేసిన అతనిని ధనంజయ డిసిల్వ క్యాచ్ పట్టగా నవాన్ ప్రదీప్ అవుట్ చేశాడు. మరో మూడు పరుగులకే, సీనియర్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ కూడా వెనుదిరిగాడు. ఒక పరుగు చేసిన అతనిని నువాన్ ప్రదీప్ క్యాచ్ పట్టడగా తిసర పెరెరా వెనక్కు పంపాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో నిదానంగా ఆడుతూ, 50 బంతుల్లో 34 పరుగులు చేసిన అజర్ అలీ చివరికి సురంగ లక్మల్ బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు చిక్కాడు. మరో సీనియర్ ఆటగాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కోగల సమర్థుడు షోయబ్ మాలిక్ 11 పరుగులు చేసి లసిత్ మలింగ బౌలింలో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు చిక్కడంతో పాక్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. కెరీర్‌లో షోయబ్ మాలిక్‌కు ఇది 250 వనే్డ. పాక్ తరఫున ఈ మైలురాయని చేరిన పదో బ్యాట్స్‌మన్‌గా అతను గుర్తింపు పొందాడు. కాగా, ఇమాన్ వాసిం నాలుగు పరుగులకే నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టడంతో అవుట్‌కాగా, 137 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ వికెట్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో ఫాహిం అష్రాఫ్ (15) రనౌటయ్యాడు. ఈదశలో సర్ఫ్‌రాజ్‌తో కలిసి మహమ్మద్ అమీర్ పాక్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. సర్ఫ్‌రాజ్ అహ్మద్‌తో కలిసి లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, రన్‌రేట్ దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాడు. వీరు 15 ఓవర్లలో అజేయంగా 75 పరుగులు జోడించారు. లసిత్ మలింగ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన సర్ఫ్‌రాజ్ అహ్మద్ పాక్‌ను సెమీ ఫైనల్స్ చేర్చాడు. 44.5 ఓవర్లలోనే, ఏడు వికెట్లకు పాక్ 237 పరుగులు సాధించింది. ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ 79 బంతుల్లో, ఐదు ఫోర్ల తో 61, మహమ్మద్ అమీర్ 43 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు
కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
శ్రీలంక ఆరు పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక దశలో మూడు వికెట్లకు 161 పరుగులు చేసిన ఆ జట్టు, 167 పరుగులకు ఏడు వికెట్లు చేజార్చుకుంది. రెండు, మూడు వికెట్లు మూడు బంతుల వ్యవధిలో కూలడంతో లంక కోలుకోలేకపోయింది.
2013 తర్వాత ఒక వనే్డ ఇంటర్నేషనల్‌లో పాకిస్తాన్ బౌలర్ మూడు లేదా అంతకంటే ఎక్కువ మెయిడిన్ ఓవర్లు వేయడం ఇదే మొదటిసారి. జునైద్ ఖాన్ తన 10 ఓవర్లలో మూడింటిని మెయిడిన్లుగా సంధించాడు. కాగా, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు ఒక వనే్డలో మొత్తం పది వికెట్లు సాధించడం ఇది ఐదోసారి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఇన్నింగ్స్: 49.2 ఓవర్లలో 236 ఆలౌట్ (నిరోషన్ డిక్‌విల్లా 73, ఏంజెలో మాథ్యూస్ 39, కుశాల్ మెండిస్ 27, అసెల గుణరత్నే 27, లక్మల్ 26, జునైద్ ఖాన్ 3/40, హసన్ అలీ 3/43, మహమ్మద్ అమీర్ 2/53, ఫాహిం అష్రాఫ్ 2/37).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 (్ఫక్రార్ జమాన్ 50, సర్ఫ్‌రాజ్ అహ్మద్ 61 నాటౌట్, అజర్ అలీ 34, మహమ్మద్ అమీర్ 28 నాటౌట్, నువాన్ ప్రదీప్ 3/60).

చిత్రాలు.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సర్ఫ్‌రాజ్ అహ్మద్ (61 నాటౌట్)
*తొలి వికెట్ పడగొట్టి లంకను దెబ్బతీసిన జునైద్ ఖాన్‌కు సహచరుల ప్రశంస