క్రీడాభూమి

కోహ్లీ స్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 13: ప్రపంచ వనే్డ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న కోహ్లీ తన సమీప ప్రత్యర్థి డేవిడ్ వార్నర్‌ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. ఎబి డివిలియర్స్ మూడో స్థానంలో ఉండగా, ‘టాప్-10’లో శిఖర్ ధావన్‌కు చోటు దక్కింది. కాగా, బౌలింగ్ విభాగంలో మొదటి మూడు స్థానాలను వరుసగా జొస్ హాజెల్‌వుడ్, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ స్టార్క్ ఆక్రమించారు. ‘టాప్-10’లో భారత బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. అక్షర్ పటేల్ 606 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నాడు. అమిత్ మిశ్రా, అశ్విన్ తదితరులు ఆ స్థాయ లో కూడా లేకపోవడం గమనార్హం.
‘టాప్-10’ బ్యాట్స్‌మెన్
1. విరాట్ కోహ్లీ (్భరత్/ 862 పాయింట్లు), 2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 861 పాయింట్లు), 3. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 847 పాయింట్లు), 4. జో రూట్ (ఇంగ్లాండ్/ 798 పాయింట్లు), 5. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 779 పాయింట్లు), 6. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా/ 769 పాయింట్లు), 7. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 768 పాయింట్లు), 8. బాబర్ ఆజమ్ (763 పాయింట్లు/ పాకిస్తాన్), 9. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 749 పాయింట్లు), 10. శిఖర్ ధావన్ (్భరత్/ 746 పాయింట్లు).
‘టాప్-10’ బౌలర్లు
1. జొస్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 732 పాయింట్లు), 2. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా/ 718 పాయింట్లు), 3. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 701 పాయింట్లు), 4. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 685 పాయింట్లు), 5. సునీల్ నారైన్ (వెస్టిండీస్/ 683 పాయింట్లు), 6. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్/ 665 పాయింట్లు), 7. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్/ 647 పాయింట్లు), 8. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్/ 630 పాయింట్లు), 9. లియామ్ ప్లంకెట్ (ఇంగ్లాండ్/ 624 పాయింట్లు), 10. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్/ 618 పాయింట్లు).

చిత్రం.. వనే్డ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ