క్రీడాభూమి

కోహ్లీ బృందంపైనే ఒత్తిడి అధికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 14: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో భారత్‌పైనే ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్లు మహమ్మద్ అషఫ్రుల్, హబీబుల్ బషర్ వ్యాఖ్యానించారు. బుధవారం వీరు ఢాకా నుంచి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెమీస్‌లో బంగ్లాదేశ్ ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకొని, బరిలోకి దిగుతున్నదని, కాబట్టి, ఫేవరిట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ బృందం ఒత్తిడికి లోనవుతుందని అన్నారు. పోరాటాలు కొనసాగించి సెమీస్ వరకూ చేరిన బంగ్లాదేశ్ మరో విజయాన్ని సాధించి ఫైనల్ చేరుకోవడానికి లభించిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని 2007 వరల్డ్ కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు విజయాన్ని సాధించిపెట్టిన బషర్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లా ఒక దశలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత పుంజుకొని, విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని అతను ప్రస్తావించాడు. అలాంటి ఫలితమే పునరావృతం అవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు. అషఫ్రుల్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశాడు. ప్రస్తుత బంగ్లా జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, వీరంతా చివరి వరకూ పోరాటాలు సాగించగల సమర్థులని చెప్పాడు. భారత్‌పై బంగ్లా సులభంగా గెలుస్తుందని చెప్పలేనని, అయితే, పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుందని అన్నాడు.

చిత్రం.. బర్మింగ్‌హామ్‌లో బుధవారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్. వీరు కీలక పాత్ర పోషిస్తే బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ చేరడం భారత్‌కు సులభమవుతుంది