క్రీడాభూమి

ప్రణయ్, శ్రీకాంత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 14: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. ప్రంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ప్రణయ్ తన కంటే ఏడు స్థానాలు ముందున్న ఆంథోనీ సిరిసకా గింటింగ్‌ను 21-13, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మొదటి సెట్‌ను సునాయాసంగానే గెల్చుకున్న ప్రణయ్‌కి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి ఎదురైంది. అయతే, సవాలును సమర్థంగా తిప్పికొట్టి, రెండో రౌండ్ చేరగలిగాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు హాంకాంగ్ ఆటగాడు వాంగ్ వింగ్ కి వినె్సంట్ నుంచి తీవ్ర ప్రతిఘ్ఠన ఎదురైంది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద 21-15 తేడాతో గెల్చుకున్న శ్రీకాంత్ రెండో సెట్‌ను 17-21 తేడాతో చేజార్చుకున్నాడు. దీనితో చివరిదైన మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. సర్వశక్తులు ఒడ్డిన శ్రీకాంత్ ఆ సెట్‌ను 21-16 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకొని, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. కాగా, సాయ ప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. మొదటి సెట్‌లో అతను సాన్ వాన్ హో చేతిలో 14-21, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధు ఇప్పటికే మొదటి రౌండ్‌ను అధిగమించిన విషయం తెలిసిందే.