క్రీడాభూమి

రిషభ్, కుల్దీప్‌లకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 15: త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో ఆడేందుకు భారత సెలెక్టర్లు గురువారం ఇక్కడ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ వనే్డ టోర్నమెంట్‌లో ఆడుతున్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించి, ప్రతిభావంతుడైన వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తో పాటు యువ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు భారత జట్టులో చోటు కల్పించారు. కరీబియన్లతో ఐదు అంతర్జాతీయ వనే్డలు, మరో ట్వంటీ మ్యాచ్‌లో తలపడేందుకు ఎంపిక చేసిన ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి కల్పించారు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న భారత జట్టులో రిషభ్, కుల్దీప్ స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉండటంతో ఎమ్‌ఎస్‌కె.ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ వీరిద్దరికీ మరోసారి జాతీయ జట్టులో చోటు కల్పించింది. అయితే చీలమండ గాయానికి శస్తచ్రికిత్స చేయించుకున్న తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌తో పాటు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న రోహిత్ శర్మను వరుసగా మరిన్ని మ్యాచ్‌లు ఆడించడం మంచిది కాదని భావించిన సెలెక్షన్ కమిటీ విండీస్ పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. ఈ పర్యటనకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా అతనికి సూచించింది. కాగా, భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన పదవీ కాలం ముగిసినప్పటికీ వెస్టిండీస్ పర్యటనలో కూడా తన సేవలను అందించేందుకు అంగీకరించాడు.
ఇదీ భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, అజింక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్‌కీపర్), యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్.