క్రీడాభూమి

ఉత్తమ ప్రదర్శన ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగే ఫైనల్ పోటీలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఆటగాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. లండన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ఆదివారం నాటి ఫైనల్‌లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి జట్టులోని ఆటగాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారని, భారత్, పాక్ జట్లు రెండూ కూడా శక్తివంచన లేకుండా పోరాడుతాయని చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తమ వ్యూహలను మార్చుకునే ఉద్దేశం లేదని కూడా అతను చెప్పాడు. కాగా, ప్రస్తుతానికి తాను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ, వాటిలో వచ్చే వార్తల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలని అనుకుంటున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. ఇది వినే వారికి తమాషాగా అనిపించవచ్చు కానీ తాను మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే అనుకొంటున్నానని, ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఆట పట్ల ఏకాగ్రత దెబ్బతింటుందని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు. బయటి ప్రపంచంతో సంబంధం కలిగి ఉండడం అంటే బయటి వాటి కారణంగా లక్ష్యంనుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉందని కోహ్లీ అభిప్రాయ పడ్డాడు.
ఇదే ప్రశ్నను పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అడిగితే అతను మాత్రం టోర్నమెంట్ అంతటా జట్టుకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది సోషల్ మీడియా అభిమానులకు తాను రుణ పడి ఉన్నానని అన్నాడు. ‘టోర్నమెంట్‌లో మొదటినుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అనూహ్యమైన మద్దతు ఇచ్చిన లక్షలాది మంది పాకిస్తానీ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వాళ్లు మాపై విశ్వాసాన్ని కనబరిచారు. ఫైనల్లో కూడా అదే విధంగా మాకు మద్దతు తెలపాలని వారిని నేను కోరుకుంటున్నాను’ అని సర్ఫరాజ్ అన్నాడు. అంతేకాదు జట్టులోని యువ ఆటగాళ్లంతా కూడా రేపటి మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని, వారంతా మానసికంగా కూడా సిద్ధమైనారని సర్ఫరాజ్ అంటూ, ఫైనల్లో కూడా ఇప్పటివరకు అపదర్శించిన స్ఫూర్తినే కనబరిస్తే మంచి ఫలితాలు సాధిస్తామని కూడా చెప్పాడు.

చిత్రం.. కోహ్లీ