క్రీడాభూమి

టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది లేనట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 18: వచ్చే ఏడాది జరగాల్సిన ట్వంటీ-20 ప్రపంచ చాంపియన్‌షిప్ ఏడో ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్‌ను రద్దు చేసి 2020లో దీనిని నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సిద్ధమవుతోంది. ప్రపంచంలోని ప్రధాన క్రికెట్ జట్లు 2018లో పలు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఐసిసిలోని ఉన్నతాధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 2018లో జరగాల్సిన ఐసిసి టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసి దానిని 2020లో నిర్వహించడం జరుగుతుందని, అయితే ఈ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ‘అవును.. నిజమే, వచ్చే ఏడాది జరగాల్సిన టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ ఏడో ఎడిషన్‌ను రద్దు చేయబోతున్నాం. వచ్చే ఏడాది ప్రధాన జట్ల మధ్య పలు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉండటంతో పాటు ఐసిసి ఈవెంట్లను కూడా చాలా నిర్వహించాల్సి ఉంది. కనుక షెడ్యూలు ప్రకారం ఏడో ఎడిషన్ టి-20 చాంపియన్‌షిప్‌ను వచ్చే ఏడాది నిర్వహించడం సాధ్యం కాదు. కనుక దీనిని రద్దు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని సభ్య దేశాలు కూడా వ్యక్తం చేశాయి. దీంతో ఈ టోర్నమెంట్‌ను 2020లో నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే ఈ టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. బహుశా దక్షిణాఫ్రికాలో గానీ లేక ఆస్ట్రేలియాలో గానీ ఈ టోర్నీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి’ అని ఐసిసి ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. 2007లో జరిగిన ఐసిసి టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వగా, 2009లో జరిగిన రెండో ఎడిషన్‌ను ఇంగ్లాండ్‌లోనూ, మూడో ఎడిషన్‌ను వెస్టిండీస్ (2010)లోనూ, నాలుగో ఎడిషన్‌ను శ్రీలంక (2012)లోనూ, ఐదో ఎడిషన్‌ను బంగ్లాదేశ్ (2014)లోనూ, ఆరో ఎడిషన్‌ను భారత్ (2016)లోనూ నిర్వహించిన విషయం విదితమే.